సార్వత్రిక ఎన్నికల్లో మోడీ వ్యతిరేఖపక్షాల ఆశలు గల్లంతుచేసేలా ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎక్జైటింగ్ పోల్స్గా వెల్లడయ్యాయి. గతంతో పోల్చుకుంటే బీజేపీకి మరిన్ని సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు అర్ధమౌతుంది. “మేజిక్ ఫిగర్ దాటి” 15 స్థానాల వరకు ఎన్డీఏ గెలుచుకుంటుందని స్పష్టం చేసింది.


ఇకపోతే యూపీఏ 126స్థానాలలోపే విజయం సాధిస్తోందని తెలిపాయి. ఇకపోతే ఇతరులు, ప్రాంతీయపార్టీల ప్రభంజనం మాత్రం కనిపిస్తుంది. 130 పైగా స్థానాల్లో ఇతరులు గెలుస్తారని జాతీయ మీడియా చానెల్స్ స్పష్టంచేశాయి. అత్యధిక స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెల కొంది. ఇకపోతే విపక్షాల్లో నైరాశ్యం నెలకొంది.


అయితే ఈ ఫలితాలు ఎంతమేరకు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటాయో?  తెలియాలంటే మే 23 వరకు నిరీక్షించాల్సిందే. ఈ ఎన్నికలపై ప్రజల్లో ఉత్కంఠ నెల కొన్న నేపథ్యంలో దేశంలోని ప్రసిద్ధ సర్వే సంస్థలు ప్రజా నాడిపై తమ అంచనాలతో కూడిన సర్వేలను బయట పెట్టాయి. తమిళనాడులోని వేలూరు లోక్‌సభ స్థానం మినహా 542 లోక్‌సభ స్థానాలు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణా చల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఏడు దశల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజల నాడి ఎటువైపు ఉందో తెలుసు కోవడానికి ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.


ఈ నేపథ్యంలో ఆయా సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో చూద్దాం.

సర్వే సంస్థ

భాజపా

కాంగ్రెస్‌

ఇతరులు

టైమ్స్‌ నౌ-వీఎంఆర్‌

306

132

104

ఎబీపీ న్యూస్‌

267

127

148

న్యూస్‌ నేషన్‌

282-290

118-126

130-138

వీడీపీఏ

333

115

94

రిపబ్లిక్‌ టీవీ‌

287

128

127

రిపబ్లిక్‌ టీవీ -జన్‌ కీ బాత్‌

295-315

122-125

102-125

రిపబ్లిక్‌ టీవీ - సీ- ఓటర్

287

128

127

ఎన్డీటీవీ

302

127

133

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా

306

152

84

ఇండియా టీవీ

300

148

94

న్యూస్‌ 18 నెట్‌వర్క్‌

336

82

124

న్యూస్‌ ఎక్స్‌-నేత

242

165

136

ఇండియా టుడే

232-251

73-99

56-74

సీఎన్ఎన్‌-ఐబీఎన్‌

336

82

124

టుడేస్‌ చాణక్య

340

70

132

national loksabha elections bjp seems to be head magic figure

మరింత సమాచారం తెలుసుకోండి: