ఎన్నికల ముందు నుంచి కూడా ఈసారి చంద్రబాబు స్టేట్మెంట్స్ చాలా చిత్రంగా ఉంటూ వచ్చాయి. ఈవీఎంలను మ్యానిపులేట్ చేస్తున్నారు. వాటిలో తమకు అనుకూలంగా ఓట్లేయించుకుంటున్నారు. అంటూ ఆయన ఘాటైన  ఆరోపణలు సంధించారు. ఇక పోలింగ్ రోజు అయితే సీఎమ్ హోదాలో ఉంటూ నా ఓటు ఎవరికి పడిందో నాకే తెలియదు అంటూ సంచలన ప్రకటన చేశారు. ఈసారి ఎన్నికలు జరుగుతున్న నెలన్నర రోజుల్లోనూ ఈవీఎంలను తలవని సందర్భం లేదు.


ఇక ఇపుడు కొత్తగా ఎగ్టిట్ పోల్స్ యాడ్ అయ్యాయి. ఎగ్టిట్ పోల్స్ ని  న‌మ్మొద్దు అంటున్నారు చంద్రబాబు.  అవన్నీ ట్రాష్ తప్పుల తడకలు, సరిగా చేయలేదు. అసలైన గెలుపు మనదేనని బాబు గారు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. మరి లగడపాటి రాజగోపాల్ సర్వే చేసి టీడీపీ గెలుస్తుందని చెబితే ఆనందించిన చంద్రబాబు నిన్న జాతీయ సర్వేలు ప్రకటించిన ఎగ్టిట్ పోల్స్ ని నమ్మొద్దని పిలుపు ఇవ్వడమేంటని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.


ఇదిలా ఉండగా ఈవీఎంలు ట్రాప్ చేస్తున్నారు, వాటిలో చిప్ పెట్టి మ్యానిపులేట్ చేస్తున్నారని పదే పదే విమర్శలు గుప్పిస్తున్న  చంద్రబాబు అవే ఈవీఎంల ద్వారా వచ్చే ఫలితాలను ఎలా నమ్ముతారు. టీడీపీ గెలుస్తుందని ఎలా చెబుతారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. గెలిస్తే మా గొప్ప, ఓడితే ఈవీఎంల తప్పు అన్నది బాబు సహా రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిపోయిందని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబుని ఎగ్టిట్ పోల్స్ ఈసారి బాగా ఇరిటేట్ చేసాయని అంటున్నారు. తనకు వ్యతిరేకంగా ఏది వచ్చిన తప్పు అనే దశలో బాబు ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: