ఎగ్జిట్‌ పోల్స్ నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ వాతారవణం ఒక్కసారిగా హాట్ హాట్ గా మారింది. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ధీమాతో వైసీపీ నాయకులు సవాళ్లు విసురుతున్నారు కూడా. ఏపీ సీఎం కచ్చితంగా జగనే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


ఈ నెల 23వ తేదీన రానున్న ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా 120కి పైగా సీట్లు గెలుచుకుని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని వైకాపా నేత కిల్లి కృపారాణి అంటున్నారు. ఒకవేళ జగన్ సీయం కాకపోతే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. 

ఈ సవాలుకు ఎవరైనా టీడీపీ నాయకులు రెడీ అంటే తాను సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ విసిరారు.  గతంలో ఈవీఎంల పనితీరు అమోఘమని, ఇంతకు మంచిన టెక్నాలజీ ఎక్కడా లేదని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. 2019 ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలుసుకుని ఏమి చేయాలో తెలియక ఓటింగ్‌ యంత్రాలను తప్పుబడుతున్నారని కిల్లి కృపారాణి మండిపడుతున్నారు. 

ఎలాగూ ఓడిపోతామని డిసైడైపోయిన చంద్రబాబు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి, ఎన్నికల అధికారులపై, సీఎస్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కిల్లి ఆరోపించారు. చంద్రబాబు చర్యలు చూసి జనం  ఆయనకు పిచ్చి పట్టిందని అనుకుంటున్నారని తీవ్రవ్యాఖ్యలు చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: