గ‌తానికి భిన్నంగా ఎగ్జిట్ పోల్ స‌ర్వేల‌పై అంచ‌నాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఏపీలో జ‌రిగిన హోరా హోరీ పోరుపై ప్ర‌జ‌లు, నాయ‌కులు, బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థులు కూడా పెద్ద ఎత్తున టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఎన్నిక‌ల‌కు, ఫ‌లితాలు వ‌చ్చేందుకు భారీగా గ్యాప్ ఉండ‌డంతో ఎవ‌రు గెలుస్తార‌నే ఉత్కంఠ కూడా రోజు రోజుకు పెరిగింది. ఇక‌, ప్ర‌ధాన ఫ‌లితాలు వ‌చ్చేందుకు ఇంకా మూడు రోజ‌లు స‌మ‌యం ఉంది. ఈ నేప‌థ్యంలో దేశంలో చివ‌రి ద‌శ పోలింగ్ ముగియ‌గానే ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు వ‌చ్చేశాయి. ఈ క్ర‌మంలోనే ఆంధ్రా ఆక్టోప‌స్‌గా పేరు తెచ్చుకున్న ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ త‌న ఆన‌వాయితీ ప్ర‌కారం ఏపీపైనా ఎగ్జిట్ స‌ర్వేఇచ్చేశారు. ఈయ‌న గ‌త ఏడాది డిసెంబ‌రులోజ‌రిగిన తెలంగాణ ఎన్నిక‌ల‌పై ఇచ్చిన స‌ర్వే బొక్క‌బోర్లా ప‌డ‌డంతో ఇప్పుడు ఇచ్చిన స‌ర్వే రిజ‌ల్ట్‌పై అనుమాన‌పు మేఘాలు క‌మ్ముకున్నాయి.


అయితే, ఇదే విష‌యంపై ల‌గ‌డ‌పాటి మాట్లాడుతూ.. న‌మ్మితే న‌మ్మండి, లేకుంటే లేదు.. అని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అదేస‌మ‌యంలో ఈ స‌ర్వే విఫ‌ల‌మైతే.. ఇక‌, స‌ర్వేల నుంచి త‌ప్పుకొంటాన‌ని కూడా చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఈ స‌ర్వేకి మ‌రింత ప్రాధాన్యం పెరిగింది. ఆర్జీస్ స‌ర్వే ప్ర‌కారం.. ఏపీలో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తారు. అదేస‌మ‌యంలో ఆయ‌న‌కు 9-110 స్థానాలు ద‌క్కుతాయ‌ని చెప్పుకొచ్చారు. ఇక‌, ల‌గ‌డ‌పాటి స‌ర్వేపై సందేహాలు కొన‌సాగుతుండ‌గానే ఆయ‌న సొద‌రుడు, ల్యాంకో ఇండ‌స్ట్రీ అధినేత ల‌గ‌డ‌పాటి మధుసూదన్  తాజాగా ఏపీలో ఎన్నికల ఫలితాలు ఏ తీరులో ఉండనున్నాయన్న విషయాన్ని చెప్పారు. 


జిల్లాల వారీగా ఆయన వెల్లడించిన ఫలితాలు ఇలా ఉన్నాయి. ల‌గ‌డ‌పాటి మ‌ధుసూద‌న్‌ అంచనా ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ కు 106 స్థానాలు పక్కాగా వస్తాయని.. టీడీపీ 68  సీట్లు.. జనసేనకు ఒక్క సీటు మాత్రమే వస్తుందని ఆయన చెబుతున్నారు. ఎంపీ సీట్ల విషయానికి వస్తే.. మధుసూదన్ అంచనా ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ సీట్లు 18 నుంచి 21 వరకు వచ్చే వీలుందని.. బాబుకు నాలుగు నుంచి ఆరు వరకు అవకాశం ఉందంటున్నారు. మధుసూదన్‌  చేయించిన సర్వే ప్రకారం.. ఏపీలో జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పారు. ఈ నేప‌థ్యంలో అటు అన్న, ఇటు త‌మ్ముడు ఇచ్చిన స‌ర్వేల్లో ఏది నిజ‌మ‌వుతుంది? అనే సందేహాలు, ఫ‌లితాల‌పై మ‌రింత టెన్ష‌న్ పెరిగిపోయింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


ల‌గ‌డ‌పాటి సోద‌రుడు చేయించిన స‌ర్వే రిజ‌ల్ట్ ఇదే.. 


జిల్లా                        వైఎస్సార్ కాంగ్రెస్             టీడీపీ      జనసేన


శ్రీకాకుళం                           5                           5               


విజయనగరం                      5                           4               


విశాఖపట్నం                       7                           7               1


తూర్పు గోదావరి                 10                          9


పశ్చిమగోదావరి                   8                           7


కృష్ణా                                11                          5


గుంటూరు                           8                          9


ప్రకాశం                                7                         5


నెల్లూరు                               8                         2


చిత్తూరు                              10                       4


కడప                                   9                        1


అనంతపురం                         6                         8


కర్నూలు                              12                       2


మరింత సమాచారం తెలుసుకోండి: