పవిత్ర‌మైన లెక్చ‌ర‌ర్ వృత్తికే ఆమె తీవ్ర‌ని మ‌చ్చ తెచ్చింది. త‌న స్టూడెంట్స్‌కు విద్యాబుద్దులు నేర్పి వారి బంగారు భ‌విత‌కు బాట‌లు వేయాల్సిన ఆమె స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునే ప‌ని చేసింది. అప‌రిమితంగా ఉన్న లైంగీక వాంచ‌లు తీర్చుకునేందుకు తాను చ‌దువు చెపుతోన్న స్టూడెంట్స్‌నే వాడుకుంది. వారిని బ‌ల‌వంతం చేసింది. త‌న కోరిక‌ల కోసం స్టూడెంట్స్‌ను బ‌ల‌వంతం చేస్తుండ‌గా ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. న్యూయార్క్‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి.


వివ‌రాల్లోకి వెళితే లిండ్సే హాల్ స్టెడ్ అనే మ‌హిళా లెక్చ‌ర‌ర్ స్థానికంగా వాట‌ర్‌లూ సెంట్ర‌ల్ డిస్టిక్ స్కూల్‌లో నాలుగు ఏళ్లుగా విధులు నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల ఆమె పాఠాలు చెప్పే స్టూడెంట్స్‌లో ఒక‌రిమీద క‌న్నేసింది. ఆ యువ‌కుడితో త‌న కోరిక‌లు తీర్చుకోవాల‌ని డిసైడ్ అయిన లిండ్సే అత‌డిని రెచ్చ‌గొట్ట‌డం ప్రారంభించింది. అక్క‌డితో ఆగ‌కుండా అతడి ఫోన్ నెంబ‌ర్లు సంపాదించి అత‌డిపై సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర మెసేజ్‌లో పోస్ట్ చేయ‌డం ప్రారంభించింది. అత‌డికి అశ్లీల ఫొటోలు కూడా పంపేది.


ఆ యువ‌కుడు... మేడమ్ ఇలా చేయ‌డం త‌ప్ప‌ని వారించినా విన్లేదు. అంతే కాకుండా త‌న కోరిక‌లు తీరిస్తే ప‌రీక్ష‌లో మంచి మార్కులు వేస్తాన‌ని ప్ర‌లోభ‌పెట్టింది కూడా. ఈ ఆఫ‌ర్ న‌చ్చ‌ని ఆ యువ‌కుడు లిండ్సే కోరిక తిర‌స్క‌రించాడు. ఇదిలా ఉంటే మ‌రో యువ‌కుడిని లోబ‌రుచుకునేందుకు లిండ్సే ప్లాన్ వేసింది. ఈ క్ర‌మంలో భాగంగానే స్కూల్ వెన‌క కారు పార్క్ చేసింది. ఆ యువకుడిని కారులోకి రమ్మని ఆహ్వానించింది. స్కూల్ ప‌నిమీద లైబ్ర‌రీకి వెళ్లాల‌ని పిల‌వ‌డంతో... అమాయ‌కంగా వెళ్లిన ఆ యువ‌కుడిపై లిండ్సే లైంగీక దాడికి పాల్ప‌డింది. ఈ తంతు అంతా స్కూల్‌లో ఉన్న సీసీ ఫుటేజ్లో రికార్డు అయ్యింది. స్కూల్ సిబ్బంది సీసీ కెమేరాల్లో ఈ తంతు చూసి వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం... వాళ్లు లిండ్సేను అరెస్టు చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: