జగన్ కచ్చితంగా ఏపీకి సీఎం అవుతారని అన్ని రకాలైన ఎగ్టిట్ పోల్ సర్వేలు చెప్పిన తరువాత ఇక ఫలితాలు రావడం ఆలస్యం అన్న మాట వినిపిస్తోంది. జగన్ సైతం గత నలభై రోజులుగా ధీమాగానే ఉన్నారు. ఎటూ ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయన్న ఉద్దేశ్యంతో ఆయన భవిష్యత్తు కార్యాచరణలో మునిగితేలుతున్నారు.


ఈ నేపధ్యంలో ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసీయార్ జగన్ని చేరమని చాలాకాలంగా కోరుతున్నారు. ఈ ఏడాది జనవరిలో కేటీయార్ జగన్ వద్దకు వచ్చి మరీ ఫెడరల్ ఫ్రంట్ విషయంపై చర్చలు జరిపారు. అయితే అన్నీ తరువాత మాట్లాడుకుందామని జగన్ చాలా తెలివిగానే చెప్పారు. అయితే దీన్నే రాజకీయం చేసి ఎన్నికల్లో వాడుకోవాలని టీడీపీ చూసింది. ఏపీ ప్రయోజనాలను జగన్ కేసీయార్ కి తాకట్టు పెడుతున్నారని కూడా విమర్శలు చేసింది.


ఇపుడు ఎటూ అధికారంలోకి వైసీపీ రాబోతోంది. దాంతో జగన్ ఓ పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా బాధ్యతాయుతమైన ఓ ముఖ్యమంత్రిగా తన ఆలొచనలకు పదును పెడుతున్నారని అంటున్నారు. ఏపీకి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని జగన్ చాలా పట్టుదలగా ఉన్నారు. ఫెడరల్ ఫ్రంట్ తో చేరితే ఎంతవరకూ పోలవరం ప్రాజెక్ట్ పై ఇతర పార్టీలు కలసి వస్తాయన్నది జగన్ బేరీజు వేసుకుంటున్నట్లుగా పార్టీ వర్గాలో వినిపిస్తోంది.


పోలవరంపై టీయారెస్ అప్పట్లో కోర్టులో  కేసులు వేయడం, మరో వైపు ఒడిషా సర్కార్ సైతం పోలవరం పై అడ్డంకులు స్రుష్టించడం వంటివి పరిగణనలోకి తీసుకున్న జగన్ ఫెడరల్ ఫ్రంట్ లో ఒడిషా సీఎం నవీన్ తోనూ, కేసీయార్ తోనూ పోలవరంపై డౌట్లు అన్నీ తీర్చుకున్నాకే మద్దతు ఇవ్వాలనుకుంటున్నట్లుగా తెలిసింది. ఇపుడు మూడు రాష్ట్రాల సీఎంల మధ్యన సామరస్యం ఉంటే పోలవరం ఎటువంటి కేసులు లేకుండా సులువుగా పూర్తి చేస్తుకోవచ్చునని కూడా భావిస్తున్నారుట. 
మొత్తానికి జగన్ తనదైన మార్క్ పాలిటిక్స్ ఇకపీ ఏపీ రాజకీయ తెరపై చూపిస్తారని అంటున్నారు. జగన్ ఏం చేసినా ముందు ఏపీ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారని, ఎక్కడా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకుండానే పొత్తులు, ఎత్తులు ఉంటాయని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: