గత పదిరోజులుగా ఏపిలోనే కాదు దేశ వ్యాప్తంగా ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్న తెలుగు న్యూస్ చానెల్ టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆయన కాంటాక్ట్ ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తలు పడుతున్నట్లు సమాచారం. అందుకోసం రవిప్రకాశ్  30 సిమ్ కార్డులను మార్చినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.

టీవీ9 కార్యాలయంలో సోదాలు జరిగిన ఈ నెల 9వ తేదీ నుంచి ఇంతవరకూ ఆయన రోజుకు రెండు నుంచి మూడు సిమ్ లను మారుస్తూ వచ్చారని, పోలీసులు అంటున్నారు. అయితే తన ఉనికి ఎవరికీ తెలియకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారని..అందుకోసం సాంకేతికంగా తన జాడను బయట పెట్టకుండా ఉండేందుకు వైఫై ద్వారా వాట్స్ యాప్ కాల్స్ లో మాత్రమే ఆయన మాట్లాడుతున్నారని కూడా గుర్తించినట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి.

డేటా చోరీ, ఫోర్జరీ వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న రవిప్రకాశ్, పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న సంగతి తెలిసిందే. మరవైపు  తనపై దాఖలైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ ను ఇవ్వాలని రవిప్రకాశ్ హైకోర్టును కోరిన సంగతి తెలిసిందే. తాను పోలీసుల విచారణకు సహకరిస్తానని, అయితే, తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: