ఎగ్జిట్ పోల్స్ , అన్నిసర్వేలూ ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరూ వైసీపీదే విజయమని తేల్చేశారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన 23 మంది అభ్యర్థులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వీరిలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నేతలతో పాటు ఓ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న వారే ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే వీరితో జిల్లాలోని నేతలతో పాటు వైసీపీలోని కీలక నేత ఒకరు సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది.


ఈ వార్త బయటకు రావడానికి కారణం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలేనని సమాచారం. ఇటీవల వెలువడిన ఫలితాల్లో మెజారిటీ సంస్థలు ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని తేల్చాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీలోని కొందరు నేతలు ముందుగానే వైసీపీ నేతలతో మంతనాలు జరిపారనే వార్త రాష్ట్రంలో హాట్ టాపిక్ అవగా టీడీపీలో ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ఎన్నికలకు ముందే వీళ్లంతా వైసీపీలోకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకున్నారని అయితే.. అప్పుడు వీలు కాకపోవడంతో ఆగిపోయారనే టాక్ వినిపిస్తోంది.


ఇక టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవనే కారణంతోనే వీళ్లంతా తమ దారి తాము చూసుకోవాలనుకుంటున్నారని తెలిసింది. ఎన్నికల ఫలితాల తరువాత వీరంతా జంప్ అవ్వటం ఖాయమని తెలుస్తుంది.  మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు అన్ని రకాల పింఛన్లను రెట్టింపు చేసింది. అంతేకాదు అన్నదాత సుఖీభవ పేరిట రైతులను నగదు పంపిణీ చేయడం పసుపు- కుంకుమ పథకం కింద డ్వాక్రా మహిళల ఖాతాలో డబ్బులు వేయడం నిరుద్యోగ భృతి వంటివి చేసింది. కానీ ఓటర్లు ఆ పార్టీ వైపు చూడలేదనే ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: