ఈవీఎంల మీద చంద్రబాబు చేస్తున్న హడావిడి కాదు.. కాదు..  దీనిని అతి అనాలేమో. ఈవీఎంల గురించి జాతీయ స్థాయిలో మిగతా నేతలు కూడా సైలెంట్ అయిన పరిస్థితి. అలాంటిది బాబు చేస్తున్న ఈ అతి ఎవరికీ ఉపయోగం. చివరికి కోర్ట్ కూడా బాబుకు అక్షింతలు వేసింది. చంద్రబాబు తన హుందా తనాన్ని పోగొట్టుకున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. యాభైశాతం వీవీ ప్యాట్ లను లెక్క పెట్టాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్తే కోర్టు ఒక్క నిమిషం విచారించి ఆ పిటిషన్ ను కొట్టేసింది.


ఆ అంశం మీద విచారణ పూర్తి అయ్యిందని, ఒక్కో అసెంబ్లీకి నియోజకవర్గానికి కనీసం ఏడు వీవీ ప్యాట్లను లెక్క పెడితేచాలని సుప్రీంకోర్టు అప్పటికే తీర్పును కూడా ఇచ్చింది. అయితే మళ్లీ అదే అంశం మీద చంద్రబాబు వివిధ పార్టీలతో కలిసి కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు వీరి వాదనను కూడా పట్టించుకోకుండా పంపించి వేసింది. ఇక అది చాలదన్నట్టుగా చంద్రబాబు నాయుడు మరో వాదన మొదలుపెట్టారు.


ఈవీఎంల కన్నా ముందు వీవీ ప్యాట్ లను లెక్కపెట్టాలంలూ ఇంకో వాదన మొదలుపెట్టారు. ఏదో విధంగా వ్యవహారాన్ని గందరగోళంగా మార్చాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇదే వాదనతో హైకోర్టుకు వెళ్లారు. ఈ వాదనను కోర్టు కొట్టివేసింది. మూడు గంటల సేపు విచారించి చంద్రబాబు నాయుడి డిమాండ్ ఒక అసంబద్ధమైనదని, ఆ మేరకు దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: