పవన్ కళ్యాణ్ మొదటి రౌండ్ లో పోటీ చేసిన రెండు స్థానాల్లో వెనుకంజలో ఉన్నాడు. ఇటు భీమవరంలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడు. అలాగే గాజువాకలో కూడా వైసీపీ అభ్యర్థి  ఆధిక్యంలో ఉన్నాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో జనసేన ఉనికి కనిపించడం లేదు. ఏ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ పోస్టల్ బ్యాలెట్స్ లో లీడ్ సాధించినట్టుగా కనిపించడం లేదు.


తొలి రౌండ్స్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీకి అనుకూల నియోజకవర్గాల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కనిపిస్తూ ఉండటం విశేషం. పెదకూరపాడు వంటి అసెంబ్లీ సెగ్మెంట్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో , హిందూపురం ఎంపీ సీట్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఫస్ట్ రౌండ్లో ఆధిక్యం సాధించారు.


శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది.నగరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆర్కే రోజా తొలి రౌండ్ లో ఆధిక్యత కనబరిచారు. భీమవరంలో జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తొలి రౌండ్లో నే వెనుక బడ్డారు. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ తొలి రౌండ్లో ఆరు వందలకు పైగా ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచారు. నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంచి ఆధిక్యత కనబరుస్తూ ఉంది. తొలి రౌండ్లో అనిల్ కుమార్ యాదవ్ కు పద్దెనిమిది వందల ఓట్ల మెజారిటీ దక్కింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: