విచ్చలవిడి కుశ్చిత రాజకీయాలను అంతులేనంతగా నిశ్శిగ్గుగా చేసిన తెలుగుదేశం పార్టీ దాని అధినేత నారా చంద్రబాబు నాయుణ్ణి ఆంధ్రప్రదేశ్ ప్రజావాహిని కడలిని తలపించేలా వెల్లువెత్తి వరదై వచ్చి బంగాళా ఖాతంలో కలిపేసింది. ప్రసార మాధ్యమాల గౌరవాన్ని మంటగలిపి ఫోర్ట్-ఎస్టేట్ గా రాజ్యాంగం నిర్వచించకపోయినా ప్రజలు ఆదరించిన తెలుగు పచ్చ మీడియా రాజకీయాల్లో అవసరానికి మించి జొరబడిన ఫలితమే "ఆంధ్రప్రదేశ్ లో వైసీపికి అద్భుత అనంత విజయం" కట్టబెట్టింది ప్రజా సునామి.
146 స్థానాల్లో వైసీపీ ముందంజ.. ఆధిక్యంలో పవన్

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపికి ప్రభంజనం సృష్టిస్తోంది. రెండు రౌండ్లు ముగిసేసరికి 148 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టనుంది. ప్రస్తుతానికి 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక జనసేన పార్టీ పూర్తిగా వెనకబడిపోయింది. కేవలం రెండు స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. జనసేనాని పవన్ కళ్యాణ్ భీమవరంలో వెనుకంజలో ఉన్నారు. 



సామాజిక వర్గ మీడియా సహాయంతో టిడిపి ఒక కులానికే మేలు చేసేసేలా తీర్చిదిద్దుకున్న కార్యక్రమాలే ఈ నిశ్శబ్ధ విప్లవాత్మక విజయానికి కారణమైంది.  ఏపిలో కుల విస్పోటన దురహంకారానికి మరో ఉదాహరణ కాంగ్రెస్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఎగ్జిట్‌-పోల్‌ పేరుతో వెలువరించిన వివరాలకు ప్రజల స్పంధన అత్యంత తీవ్రం గా ఉంది. ఆధారాలు లేని సర్వే ద్వారా బెట్టింగుల పర్వంలో బ్రతికేవాళ్లెందరో? చచ్చే వాళ్ళెందరో? ఆ దైవమే చెప్పాలి.
Image result for YCP in AP BJP in India land slide victory
లగడపాటి ఎవరెవరిని ఇంటర్వ్యూ చేశారు, ఎన్ని శాంపిల్స్‌ తీసారు? శాస్త్రీయంగా విశ్లేషించడానికి చేపట్టిన పద్ధతేమిటో వెల్లడించాలని  గురువారం ట్విటర్‌ వేదికగా చూపాలని వైసీపి ఎంపీ విజయసాయిరెడ్డి - టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాల్ పై ధ్వజమెత్తారు. లేక పోతే చీటింగ్ కేసు నమోదు చేసి జళ్ళలో వేయాలని అన్నారు. ఇంకో సారి సర్వే అనకుండా గుణపాఠం నేర్పాలని ట్వీట్‌ చేశారు.


వీవీప్యాట్లు లెక్కించాలని చంద్రబాబు చేస్తున్న హడావుడి ఆయననో  "జోకర్ స్థాయి" కి ఒక గల్లి రాజకీయ నాయకుని స్థాయి కి దిగజార్చిందని వి. విజయసాయిరెడ్డి మండి పడ్డారు. గత డిసెంబరులో కాంగ్రెస్ మూడు హిందీ రాష్ట్రాల్లో గెలిచినపుడు ఈవీఎంలు, వీవీప్యాట్ల గురించి మాట్లాడని ఈ చంద్రబాబు అనే వ్యక్తి ఇప్పుడు క్షణం తీరిక లేకుండా కోర్టుల చుట్టూ, ఆసేతు సీతాచలంలోని నేతల చుట్టూ ప్రదక్షిణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ప్రజలు కప్పలతక్కెడ రాజకీయాలకు అవకాశం యివ్వకపోవటంతో జంపింగ్ జపాంగులకు ఎలాంటి అవకాశం యివ్వలేదు దీంతో రాష్ట్రంలో చంద్రబాబు పాలనకు శాశ్వత చరమగీతం పాడినట్లే! 


అలాగే దేశంలోని ప్రతిపక్షాలన్నీ కలిసి వ్యక్తిగతంగా ప్రధాని నరేంద్ర మోడీని దూషిస్తూ చేసిన ఎన్నికల ప్రచారం బాజపా మిత్రపక్షాలకు విజయ విస్పోటనాన్ని బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: