గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలకంగా మారిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ప్రశాంత్ కిషోర్ టీం వైఎస్ఆర్ సీపీ ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించింది. టీం లో కొందరు కీలక వ్యక్తులు టీం ని నడిపిస్తూ పార్టీ కి ఘన విజయాన్ని అందించారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రశాంత్ కిషోర్ టీం వైఎస్సార్సీపీ తరపున తమ ప్రచారాన్ని మే-2017 లో ప్రారంభించింది.

709 రోజులు తమ ప్రణాళికల్ని అమలు చేసి వ్యూహం ప్రదర్శించింది. వైఎస్సార్సిపి తరపున ఐ-ప్యాక్ మొత్తం 17 ప్రధాన ప్రచార కార్యక్రమాలను చేసింది. అందులో 13 ప్రచార కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో చేస్తే 4 ప్రచార కార్యక్రమాలు ఆన్ లైన్ లో విప్లవం సృష్టించాయి. ప్రచారానికి మొదటి అస్త్రంగా ఐ-ప్యాక్ పార్టీని క్షేత్ర స్థాయిలో బూత్ క్యాడర్ ని బలోపేతం చేసింది. అదే విధంగా పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తూ వారికి మార్గదర్శకత్వం వహించింది. ఐప్యాక్ సరైన వ్యూహాన్ని నిర్దేశించటం వల్ల పార్టీ ఘన విజయాన్ని సాధించింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. 


ప్రశాంత్ కిశోర్ టీం ముందు నుండి పార్టీ ని సంస్థాగతంగా బలోపేతం చేయటంలో దృష్టి సారించింది. అందులో భాగంగా ప్రతి నియోజవర్గంలో ప్రశాంత్ కిషోర్ టీం సభ్యులు క్షేత్ర స్థాయిలో పని చేస్తూ బలమైన నాయకులను పార్టీకి అనుసంధానం చేస్తూ, బలహీనమైన నాయకులకు శిక్షణ ఇస్తూ ముందుకు సాగారు. అలాగే డిజిటల్ పరంగా కూడా పార్టీని బలోపేతం చేస్తూ అధికార పార్టీకి ఎప్పటికప్పుడు కౌంటర్లు వైఎస్సార్సిపి లో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికారు. ఐ-ప్యాక్ ప్రోద్భలంతో అప్పటి నుండి పార్టీ కార్యకర్తలు కూడా ఉత్సహాంగా పని చేయటం ప్రారంభించారు.


ఐ-ప్యాక్ కొన్ని కీలక వ్యూహాల్ని అమలు చేసి ప్రజల నాడి పసిగట్టగలిగింది. సంస్థ చేసిన ప్రచారాలన్నీ ప్రజల్లో జగన్ పట్ల పాజిటివ్ భావాన్ని పెంపొందేలా చేశాయి. ఐ-ప్యాక్ చేసిన "రావాలి జగన్- కావాలి జగన్" పేరుతో ప్రచార కార్యక్రమయితే ఏపీలోని ప్రతి గడప గడపకు తాకింది. ఐ-ప్యాక్ చేసిన ఇంకో ప్రధాన ప్రచార కార్యక్రమం బై బై బాబు. ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు బై బై అంటూ చేసిన ఈ కార్యక్రమం డిజిటల్ పరంగా ఒక అధికార పార్టీ టిడిపి పట్ల తుపాన్ లా మారి వారి అధికారం కొట్టుకుపోయేలా చేసింది. 


"రావాలి జగన్ కావాలి జగన్" పేరిట ఐ-ప్యాక్ రూపొందించిన ప్రచార గీతం సోషల్ మీడియా మరియు యూ ట్యూబ్ లో ఒక చరిత్ర సృష్టించింది. దాదాపు 3 కోట్ల ప్రజలకు ఈ గీతం చేరువయ్యి అధికార పార్టీ గుండెల్లో గుబులు పుట్టించింది. గత రెండు సంత్సరాలుగా ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి జగన్ కి మర్చిపోలేని విజయాన్ని అందించింది ప్రశాంత్ కిషోర్ టీం.

వైఎస్సార్సిపి కి ఇంతటి ఘనవిజయాన్ని అందించటంలో ప్రశాంత్ కిషోర్ టీంలో కొందరు కీలకంగా వ్యవహరించారు. టీం లీడ్ గా రిషిరాజ్ సింగ్ ముందుండి నడిపిస్తే టీం ఫీల్డ్ లీడ్ గా శాంతను సింగ్, డిజిటల్ లీడ్ గా బ్రహ్మానంద పాత్ర, జగన్ ప్రసంగాల రూపకల్పనలో, డిజిటల్ మరియు సోషల్ మీడియా పరంగా హరికాంత్ అత్యంత కీలకపాత్ర పోషించారు. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ టీం దక్షిణ భారత దేశంలో ఒక పార్టీకి ఘన విజయాన్ని అందించి భారత రాజకీయాల్లో ఒక పొలిటికల్ కన్సల్టన్సీ గా తన ప్రాధాన్యతను చాటుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: