టీడీపీ పార్టీ ఇంత ఘోర ఓటమిని చవిచూస్తుందని ఆ పార్టీ నేతలు కూడా ఉహించివుండరు. టీడీపీ నేతలకు ఏం మాట్లాడాలో అర్ధం కాలేని పరిస్థితి. పెద్దనేతలు, చిన్ననేతలు అన్న తేడాల్లేవు.. ఇప్పుడెవరూ జనానికి మొహం చూపించే పరిస్థితి లేదు. బయట రోడ్ల మీద వైఎస్సార్సీపీ కార్యకర్తల సంబరాల్ని చూడలేక, ఆ హోరుని తట్టుకోలేక ఇంట్లోనే తలుపులు బిగించుకుని కూర్చోవాల్సి వస్తోంది. ఉదయం 8.30 నిమిషాల నుంచే పరిస్థితి ఎలా వుండబోతోందో టీడీపీ నేతలకు అర్థమయిపోయింది.


మరోపక్క వైసీపీ నేతలు కొన్నిచోట్ల, ముందస్తుగానే 'గెలుపు' ఫ్లెక్సీలను సిద్ధం చేసేసుకున్నారు. పోలింగ్‌ రోజునే ఫ్యాను గాలిపై వైఎస్సార్సీపీ శ్రేణులకు ఓ అవగాహన వచ్చేసింది. ఇన్ని రోజులపాటు అధికారిక ఫలితం కోసం ఎదురుచూశాక, వారు ఆశించిన ఫలితం వచ్చాక వైసీపీ శ్రేణుల ఆనందానికి ఆకాశమే హద్దుగా మారుతుంది కదా.! అదే జరుగుతోందిప్పుడు. ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయడమే తరువాయి.


రాజీనామా చేస్తానంటారా.? లేదు లేదు, జూన్‌ 8వ తేదీ వరకూ తనకు గడువు వుంటుందని హడావిడి చేస్తారా.? అంత సీన్‌ లేదు. వెయ్యిశాతం టీడీపీనే గెలుస్తుందని ఈరోజు ఉదయం కూడా చంద్రబాబు పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించారు. ఇప్పుడాయనకు ధైర్యం చెప్పడానికి సైతం ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఒక్కటి మాత్రం నిజం, తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నిలువునా ముంచేశారు.. అదీ తన అహంకారంతో.

మరింత సమాచారం తెలుసుకోండి: