పార్టీల విలీనం ఇప్పుడు తెలుగు నాట కొత్త విషయమో..పెద్ద విషయమో కాదు.  ఆ పార్టీ గుర్తును, పార్టీ పేరును సమూలంగా, సశాశ్వతంగా మరొక పార్టీ తమలో కలిపేసుకవడమే పార్టీ విలీనం అంటారు.  


కొంత కాలం క్రితం తెలుగు దేశం శాసన సభా పార్టీనని తమలో కలిపేసుకున్న కేసీఆర్  ఈసారి కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని తమలో కలిపేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైసీపీ దాదాపు 150 పై చిలుకు స్థానాలలో విజయ దుంధుభి మోగిస్తుంది.  175 స్థానాలున్న అసెంబ్లీలో 150 స్థానాలు పైగా ప్రభుత్వం అంటే బ్రహ్మాండమైన, బలమయిన ప్రభుత్వం అని వేరే చెప్పనక్కరలేదు. 


ప్రభుత్వ స్థాయిలో దాదాపు 70 సీట్లను పైగా గెలురుకున్న బలమయిన ప్రతిపక్షాన్నే ఒక ఆట ఆడుకున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ..అత్తెసరు 20 సీట్లతో ఉన్న ప్రతిపక్షాన్ని కుదురుకొనిస్తుందా?


జగన్ వంటి మొండి నాయకుడు, బలమైన ప్రతిపక్షం ఉన్న చోటే దాదాపు 30 మంది ఎమ్మెల్యేలను పార్టీ మార్పించి..వారందరినీ అనర్హత వేటు వేయకుండా కాపాడిన ఆంధ్రప్రదేశ్ రాజకీయం అత్తెసరు 20 సీట్ల ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఊరుకుంటుందా?


పట్టుమని పది మంది పార్టీ మారితే..శాసన సభా పక్షం వైసీపీలో కలిసిపోతే మిగిలిన వారందరూ చంద్రబాబుతో సహా చచ్చినట్లు వైసీపీ కండువా వేసుకోక తప్పదు కదా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏమో ఏదయినా జరగవొచ్చు..వైసీపీకి, తేదేపా ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ అలాంటిది కాదంటారా?


మరింత సమాచారం తెలుసుకోండి: