పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గత పదీ పదిహేనేళ్లుగా రాజకీయాలను ఒంట బట్టించుకొని మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం దుర్భర ఓటమి నుంచి నేర్చుకొని జనాల్లోకి తీసు కొచ్చిన పార్టీ జనసేన.


పార్ట్ టైమ్ రాజకీయాలను చేసుకుంటూ ప్రశించకుండా అయిదేళ్లు కాలం గడిపిన పవన్ కళ్యాన్ ఎన్నికలకు ముందు మూడు నెలల నుంచి పూర్తి రాజకీయనాయకుడిగా రూపాంతరం చెందడాన్ని ఆంధ్రప్రజలు నమ్మలేదు సరికాదా ఛీత్కరించకున్నారని అర్థమవుతుంది ఫలితాల సరళి చూస్తే.


పవన్ కళ్యాన్ తన సొంత నియోజక వర్గమయిన భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ రావు అనే సాఫ్ సీదా చోటా నాయకుడి చేతిలో దారుణంగా ఓడిపోవడం అంటే పవన్ కళ్యాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసిపోతుంది. 


పవన్ కళ్యాన్ ఛరిష్మాను నమ్ముకొని పోటీలో దిగిన పదుల అభ్యర్థులకు చేతిల చిప్ప మాత్రమే మిగిలిందంటున్నారు ఆంధ్రప్రజ.
ఓట్లు లేవు- సీట్లు లేవు..పార్టీని నడిపించే స్థాయి, ఓపిక, సహనం లేవు..మరి జనసేన దుకాణం బంద్ కాక ఇంమేముందీ అంటున్నారు భీమవరం ఓటర్లు..మరీ మీరేమంటారు..?


మరింత సమాచారం తెలుసుకోండి: