Image result for rahul gandhi wins wayanad result

ఉత్తరాది అమేది నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బిజేపి నేత స్మ్రితి ఇరాని పై ఓటమి తీరానికి చేరుతున్న వార్తలు వస్తుండగా - మరో ప్రక్క దేశ ఎన్నికల చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు. కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ కు పోటీ చేసిన రాహుల్ గాధి అత్యంత ఆధిఖ్య మార్జింతో అఖండ మెజారిటీతో విజయం సాధించారు. గతంలో ఉన్న రికార్డులన్నీ బ్రద్దలు చేస్తూ అత్యంత మెజారిటీతో గెలిచిన ఎంపీగా పార్లమెంట్‌లో రాహుల్ అడుగుపెట్టబోతున్నారు. 


వయనాడ్‌లో రాహుల్ గాంధీ 13,37,438 ఓట్లు గెలుచుకున్నారు. అధికార ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి పీపీ సునీర్‌కు 4,99,067 ఓట్లు లభించాయి. రాహుల్ గాంధీ విజయం ఘనతరం అయింది. ఇందులో విశేషం ఏంటంటే 8,38,371 ఓట్ల మెజారిటీ తో గెలుపొందిన భారత దేశపు పార్లమెంటేరియన్గా రాహుల్ రికార్డు సృష్టించారు.
 Image result for rahul gandhi wayanad rally
2014 లో ఉప ఎన్నికలో బీజేపీ నేత ప్రితమ్ గోపీనాథ్‌ రావు ముండే అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. బీడ్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.పాటిల్‌ పై ఆయన 6,96,321 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక సాధారణ ఎన్నికలో పశ్చిమ బెంగాల్‌ నుంచి సీపీఎం అభ్యర్థి అనిల్ బసు 5,92,502 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: