సబ్బం హరి....రాజశేఖర్ రెడ్డి హయాంలో నుండి జగన్ వైసీపీ పార్టీ స్థాపించే వరకు జగన్ కి, రాజశేఖర్ రెడ్డికి కోటరీ సభ్యునిగా వెలుగొందిన అనకాపల్లి నేత ఈ సబ్బం హరి.


జగన్ రాజకీయ నాయకునిగా ఎదిగే క్రమంలో.. సబ్బం హరి జగన్ నుంచి దూరం జరిగి..జగన్ వ్యక్తిత్వమును హననం చేసిన విధానం.. తరువాత తెదేపా పంచన చేరి విశాఖ - అనకాపల్లి ప్రాంతాల్లో వైసీపీని ఇబ్బంది పెట్టిన విధానం ఇప్టపికీ మరచిపోలేమంటారు వైసీపీ అభిమానులు.


జగన్ కు అందరికంటే ఎక్కువ ఇబ్బంది క్రియేట్ చేసిన సబ్బంహరి తెదేపా శాసనసభ సభ్యునిగా అరకు ప్రాంతానికి పోటీ చేయడం, గంటా శ్రీనివాస రావు ను ఒదులుకొని మరీ వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ కు ప్రత్యర్థిగా పోటీ చేయడం సహజంగానే సబ్బం హరిని లైమ్ లైట్ లోకి తీసుకు వచ్చాయి.  సబ్బం కూడా మీడియా నుంచి ఎంత పించుకోవాలో అంతకంటే ఎక్కువ తన మెత్తనయిన మాటలతో పిండుకున్నారు.


ఎన్నికలయిన తరువాత రోజు నుంచి నిన్నటి వరకు పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చి, ప్తరి ఇంటర్వ్యూలో జగన్ ను, వైసీపీ ని తూర్పారబడుతూ మెత్తగా గనపం దించిన ఈ తేదేపా నేత మొత్తానికి సర్ధేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు విశాఖ ప్రజ. మరి మీరేమంటారు?


2019 ఎన్నికల ఫలితాలను క్షణ - క్షణ వివరాలతో మీ ముందుంచుతుంది ఇండియాహెరాల్డ్ గ్రూప్ సంస్థ.



మరింత సమాచారం తెలుసుకోండి: