ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరూ ఊహించని విధంగా జగన్ కు విజయాన్ని అందించారు.  గత ఎన్నికల్లో టిడిపి ఈ స్థాయిలో విజయం దక్కలేదు.  అప్పట్లో టీడీపీ బీజేపీతో పొత్తుపెట్టుకుంది.  పవన్ కళ్యాణ్ ఈ కూటమికి సహాయం చేశారు.  దీంతో టీడీపీ విజయం సాధించింది.  ఈసారి ఎవరికి వారు సొంతంగా పోటీ చేశారు.  


ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైకాపా 150 చోట్ల లీడింగ్ లో ఉన్నది.  టీడీపీ కేవలం 24 స్థానాల్లో మాత్రమే లీడింగ్ లో ఉండటం విశేషం.  జనసేన 1 స్థానంలో మాత్రమే లీడింగ్ లో ఉంది.  లోక్ సభ విషయానికి వస్తే వైకాపా 25 స్థానాల్లో లీడింగ్ లో ఉండటం విశేషం.  జగన్ పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని ఓటు వేశారు.  అయన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి.  నాలుగేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ... ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశాడు.  ప్రత్యేక హోదా ఇచ్చే కూటమికి సపోర్ట్ చేస్తానని అన్నాడు


ఇక్కడ అసలు విషయం ఏమిటంటే... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటే జగన్ కేంద్రంలో కీలకంగా ఎదగాలి.  బీజేపీకి వైకాపా అవసరం ఏర్పడాలి.  ఫలితాలను బట్టి చూస్తుంటే... బీజేపీకి ఆ అవసరం ఉండే విధంగా కనిపించడంలేదు.  సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్ల కంటే ఇంకా ఎక్కువ సీట్లు ఆ పార్టీకి వచ్చాయి.  అంతేకాదు, ఎన్డీఏ పక్షాలు కలుపుకుంటే 350 స్థానాల్లో ముందంజలో ఉంది.  ఇప్పుడు జగన్ ముందున్న మొదటి సవాలు ప్రత్యేక హోదా.  దాన్ని కేంద్రంతో పోరాటం చేసి ఎలా తీసుకొస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: