నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ఫలితాలను అనుసరించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయటం దాన్ని రాష్ట్ర గవర్నర్ అమోదించటమూ జరిగిపోయింది. ఒక శకం ముగిసిపోయింది. 

ఒక విశ్వసనీయత లేని నాయకుడి సారధ్యంలో ఉన్న పార్తీ దానికి తోదు దాన్ని అనుసరించిన పార్టీలకు కూడా అవిశ్వసనీయత అనే చీడ అంటుకుంది. ఉదాహరణగా: 
తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి అనూహ్యమైన ఫలితాలొచ్చాయి. ఏకంగా ముగ్గురు కాంగ్రెస్‌ పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యులుగా విజయం సాధించారంటే ఈ పరిస్థితుల్లో అసాధారణమైన విషయం మాత్రమే కాదు. ఇది నిజంగానే కాంగ్రెస్‌ పార్టీకి చాలా పెద్ద గెలుపు. 
Image result for chandrababu spoiled congress TMC also
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణా లో మునిగిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ దాని అధినేత. ఆ విషయం ఇదిగో, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలతో మరోసారి ఋజువైంది.  టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి, మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా గెలిచారు. ఈ ఇద్దరూ ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన వారే. మరో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అది వేరే విషయం. 

అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో చాలా మంది టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేసిన సందర్భంలో ఒక్క ఎంపీ సీటైనా కాంగ్రెస్‌కి లభించే అవకాశం లేదని అనుకున్నారు. కానీ, కాంగ్రెస్‌ అనూహ్యంగా పుంజుకుంది. ఇక, జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాకే తగిలింది. కాంగ్రెస్‌కి మాత్రమే కాదు, చంద్ర బాబు పుణ్యమా! అని, ఆయనతో జతకట్టిన చాలా పార్టీలకు ‘మైండ్‌ బ్లాంక్‌’ అయ్యే ఫలితాలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌ లోనూ మమత బెనర్జీకి బీజేపీ రూపంలో గట్టి షాకే తగలడం గమనార్హం. ఇదంతా చంద్రబాబు “లెగ్‌” మహిమే అనుకోవాలా! అంతే మరి.!
Image result for chandrababu spoiled congress TMC also
మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా వున్నా, చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్‌ ని ముంచేస్తే, కాంగ్రెస్‌ తో స్నేహం కారణంగా ఎంతో కొంత చంద్రబాబు ఏపీ లోనూ గట్టిగానే మునగాల్సి వచ్చింది. చంద్రబాబు తన విశ్వసనీయతను అత్యంత దారుణంగా కోల్పోయారనడానికి కాంగ్రెస్‌తో స్నేహమూ ఒక నిదర్శనం.  ఇప్పుడు టీడీపీ నేతలు, దాని అనుబంధ మీడియా సామాజిక మీడియా కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పగలరని చెప్పగలరా!, చక్రం తిప్పదం ప్రక్కన బెడితే అసలు జనంలోకి వచ్చే సాహసమైనా చేస్తారనేది ఇంక కొన్నాళ్ళు ప్రశ్నార్ధకమే. 

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: