ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతుందని ఆశించిన జనసేన ఘోరంగా విఫలమైంది. ఆ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.  జనసేనతో పొత్తు పెట్టుకున్న చిన్నాచితకా పార్టీలు సైతం ఖాతా తెరవలేకపోయాయి. 


సాక్షాత్తూ పవన్ కల్యాణే రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయాడు. కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఆ పార్టీలో గెలిచారు. అయితే ప్రజల తీర్పుపై పవన్ కల్యాణ్ స్పందన హుందాగా ఉంది. 

ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నానని.. కానీ ఓడిపోయినా ప్రజలతోనే ఉంటానని పవన్ చెప్పారు. తుదిశ్వాస విడిచేవరకు రాజకీయాలలోనే ఉంటానని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ వారికి అండగా నిలుస్తామన్నారు. 

ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన వైకాపా, సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వైఎస్‌ జగన్‌కు, దేశంలో రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అభ్యర్థిస్తున్నానన్నారు పవన్. 

సుదీర్ఘకాలంగా మార్పు కోసం జనసేన పెట్టాం.. ఎన్ని రకాల ఒడిదొడుకులు వచ్చినా ఎదుర్కొనే సత్తా, ధైర్యం మాకు ఉంది. అన్నింటికీ సిద్ధపడే పార్టీ పెట్టాం. మా పార్టీకి ఓటు వేసిన ప్రతి ఓటరుకూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: