ఎన్నికల రిజల్స్ ఎప్పుడెప్పుడా అని ఏపీ ప్రజలు, ప్రధాన పార్టీల నేతలు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది, ప్రజలు వైసీపీ పార్టీకి బ్రహ్మరధం పట్టారు.చంద్రబాబు నాయుడు కోలుకోలేని విధంగా ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పు బాబు కి పెద్ద షాకే ఇచ్చింది. స్వయంగా తన తనయుడు లోకేష్ కూడా ఓడిపోవడం చంద్రబాబు కి ఘోరమైన అవమానాన్నే మిగిల్చింది. ఏపీ ప్రజలు తనని తమ్మలేడనే విషయం బాబు కి స్పష్టంగా అర్థం అయ్యింది.ఇదిలాఉంటే బాబు ఇప్పటికే ఓటమి భారంతో కుంగిపోతుంటే తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం బాబు ని మరింత ఇరకాటంలో పెట్టేలా ఉందని అంటున్నారు పరిశీలకులు.

 Image result for roja vs chandrababu

ఇంతకీ జగన్ తీసుకుంటున్న నిర్ణయం ఏమిటంటే..వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు అందరూ వైసీపీ నేతలపై ఎన్నో విమర్శలు చేశారు , మానసికంగా ఎన్నో ఇబ్బందులకి గురిచేశారు. వీరిలో ముఖ్యంగా టీడీపీచే ఘోరంగా అవమానం ఎదుర్కున్న నేత నగరి ఎమ్మెల్యే రోజా. ఈ ఎన్నికల్లో సైతం ఆమె నగరి నుంచీ 2 వేల పైచీలుకు ఓట్లతో గెలుపొందారు. ఈ క్రమంలో ఆమెకి మంత్రి పదవి రావడం ఖాయమని అందరికి తెలిసిందే. కానీ జగన్ మాత్రం ఆమె గతంలో పొందిన అవమానాలకి తగిన న్యాయం చేయాలని భావించి మంత్రిగా కంటే కూడా స్పీకర్ గా ఆమెకి అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే రోజా స్పీకర్ అయితే చంద్రబాబు నాయుడు రోజా ని అధ్యక్షా అని సంభోదించాల్సి ఉంటుంది. దాంతో బాబు ఒకింత ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని. ఇలా చంద్రబాబు బ్యాచ్ కి బుద్ధి చెప్పాలి యోచిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు పలువురు నేతలు ఇప్పటికే మంత్రి పదవులని జగన్ డిసైడ్ చేశారని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజకీయ వర్గాలలో చర్చల ప్రకారం. ఎవరెవరికి ఏఏ శాఖలని జగన్  అప్పగించానున్నారంటే  

 

 Image result for jagan cabinet

ముఖ్యమంత్రి : వై యస్ జగన్మోహన్ రెడ్డి

స్పీకర్ : రోజా లేదా ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి

డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి

రెవిన్యూ : ధర్మాన ప్రసాద రావు

హోమ్ : పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి

ఫైనాన్స్ : బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి

రోడ్స్ & భవనాలు : బొత్స సత్యనారాయణ

భారీ నీటి పారుదల : కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు

మున్సిపల్ : గడికోట శ్రీకాంత్ రెడ్డి

స్త్రీ శిశువు సంక్షేమం : తానేటి వనితా

పౌర సరఫరాలు : పిల్లి సుభాష్ చంద్రబోస్

వైద్య : అవంతి శ్రీనివాస్

విద్య : కురసాల కన్నబాబు

బీసీ సంక్షేమం : తమ్మినేని సీతారాం

అటవీ శాఖ : శిల్ప చక్రపాణి రెడ్డి

దేవాదాయ : కోన రఘుపతి

పంచాయతీ రాజ్ : అనంత వెంక‌ట్రామిరెడ్డి

ఐటీ : మేక‌పాటి గౌతం

విద్యుత్ శాఖ : త‌మ్మినేని సీతారాం

మైనింగ్ : బాలినేని శ్రీనివాస్ రెడ్డి

సినిమాటోగ్రఫీ: గ్రంధి శ్రీనివాస్

కార్మిక, ట్రాన్స్ పోర్ట్ : ఆళ్ళ నాని

సాంగిక సంక్షేమం : k. భాగ్యలక్ష్మి

వ్యవసాయం : ఆళ్ళ రామకృష్ణ రెడ్డి

మార్కెటింగ్, పశుసంవర్థకం : అనిల్ కుమార్ యాద‌వ్‌

టూరిజం, తెలుగు సంస్కృతి,దేవాదాయ : కోన రఘుపతి

గృహ నిర్మాణం : కొక్కిలిగడ్డ రక్షణనిధి

ఇండస్ట్రీస్ : కాకాని గోవర్ధన్ రెడ్డి



మరింత సమాచారం తెలుసుకోండి: