సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి...తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌. తాజాగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రి కూడా. ఎంద‌రో సీనియ‌ర్ నేత‌లు ఉండ‌గా తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. తన ఇలాకాగా భావించిన స‌ర్వేప‌ల్లిలో  ఎందుకంటే..కార‌ణం ఒక్క‌టే వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై అడ్డ‌గోలు విమ‌ర్శ‌లు చేయ‌డం. అదొక్క కార‌ణంతోనే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కింద‌నే ప్ర‌చారం ఉంది. అయితే, తాజాగా సోమిరెడ్డి దిమ్మ‌తిరిగే ప‌రాజ‌యం ఎదురైంది. అది అలాంటి ఇలాంటి ప‌రాజ‌యం కాద‌ని అంటున్నారు.


సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌ల్లో ఒక‌రు.నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న ప‌లు ద‌ఫాలుగా బ‌రిలో దిగారు. స‌ర్వేప‌ల్లి నుంచి 1994, 1999లలో విజయం సాధించిన సోమిరెడ్డి అనంత‌రం వ‌రుస‌గా...ఆయ‌న మూడుసార్లు ఓట‌మి పాల‌య్యారు. 2004లో సోమిరెడ్డిపై కాంగ్రెస్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి 7వేలకు పైగా మెజార్టీతో గెలిచారు. 2009లో కూడా కాంగ్రెస్ నుంచి ఆదాలనే సోమిరెడ్డిపై 10వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో వైసీపీ నేత‌ కాకాని గోవర్ధన్ రెడ్డి చేతిలో ఐదువేల పైచీలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.


సోమిరెడ్డికి హ్యాట్రిక్ ఓట‌మి ఎదురైన‌ప్ప‌టికీ...అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు త‌న కేబినెట్లో మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. వ‌రుస‌గా మూడు ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌వ‌డం, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో గెలుపును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న సోమిరెడ్డి పార్టీ కార్య‌క‌లాపాల‌పై మ‌రింత దృష్టి సారించే క్ర‌మంలో ఎమ్మెల్సీ ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేసేశారు. అనంత‌రం బ‌రిలో దిగారు. అయితే. వైసీపీ అభ్య‌ర్థి కాకాని చేతిలో మ‌ళ్లీ ఓట‌మి త‌ప్ప‌లేదు. కేబినెట్ మంత్రి అయిన సోమిరెడ్డి ఘోర ప‌రాజ‌యంపై వైసీపీ శ్రేణులు స్పందిస్తూ...``జ‌గ‌న్ గెలుపు చూశావుగా...నీ ఓట‌మి సంగ‌తేంది?త‌ల‌కాయ ఎక్క‌డ‌పెట్టుకుంటావు సోమిరెడ్డి...?`` అంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్నిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: