పరిటాల శ్రీరామ్.. మొన్నటి ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన కీలకమైన నాయకుల్లో ఈయన ఒకరు. తండ్రి పరిటాల శ్రీరామ్ తర్వాత మళ్లీ ఆ కుటుంబం నుంచి కుమారుడిగా వారసుడిగా వస్తున్న వ్యక్తికావడంతో అంతా ఇంట్రస్ట్ చూపించారు. పరిటాల బ్రాండ్‌తో గెలుపు ఖాయం అని అనుకున్నారు.  


సునీత తాను పోటీ నుంచి తప్పుకుని శ్రీరామ్‌ ను బరిలో దింపారు. కానీ వైసీపీ సునామీలో పరిటాల శ్రీరామ్ కూడా కొట్టుకుపోయారు. పరిటాల శ్రీరామ్ పై వైసీపీ అభ్యర్థి ప్రకాష్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 

ప్రకాశ్ రెడ్డికి కు 25,575 ఓట్ల మెజారిటీ వచ్చింది.  2009లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009, 2014లో ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత విజయం సాధించారు. కానీ ఈ స్థాయి మెజారిటీ ఇక్కడ గత మూడు ఎన్నికల్లో ఎవరికీ రాలేదు. 

ఐతే.. ఇక్కడే ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ ఉంది.  పరిటాల శ్రీరామ్ గురువారం అసలు కౌంటింగ్ కేంద్రం వద్దకు కూడా రాలేదు. ఓటమి గురించి ముందే అవగాహన ఉండటం వల్లే ఆయన రాలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. రాప్తాడులో కౌంటింగ్ ఆరంభం నుంచీ ప్రకాష్ రెడ్డి ఆధిక్యంలోనే ఉన్నారు. దీంతో పరిటాల శ్రీరామ్‌ మాత్రం కౌంటింగ్‌ కేంద్రం వద్దకు కూడా రాలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: