వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్టీ ఎంఎల్ఏలు శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసనసభా పక్ష సమావేశం జరిగింది. పార్టీ తరపున ఎన్నికైన 151 మంది ఎంఎల్ఏలు సమావేశమయ్యారు.

 

 సమావేశంలో ఎంఎల్ఏలు తీసుకున్న నిర్ణయాన్ని జగన్ నేతృత్వంలోని ఎంఎల్ఏలు, సీనియర్ నేతల బృందం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ను కలిసి వివరించనున్నారు. దాంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోమని గవర్నర్ జగన్ ను కోరుతారు. దాంతో సిఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయటానికి రెడీ అవుతారు. బొత్సా సత్యానారాయణ తీర్మానాన్ని ప్రవేశపెడితే, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్ బలపరిచారు.

 

ఈనెల 30వ తేదీన ప్రమాణ స్వీకారానికి జగన్ రెడీ అవుతున్నారు. 30వ తేదీ ఉదయం 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పాయి. ప్రమాణ స్వీకారం చేసే వేదికను మాత్రం ఇంకా నిర్ణయం కాలేదు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: