వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, ఏపీకి కాబోయే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై విమానాశ్ర‌యంలో దాడిచేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ విడుద‌ల‌య్యాడు. తూర్పుగోదావ‌రిజిల్లా రాజమండ్రి జైలు నుంచి  జగన్‌పై హత్యాయత్నం కేసు నిందితుడు విడుదల తర్వాత మీడియాతో మాట్లాడుతూ, సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌పై దాడి, త‌న‌కు టీడీపీతో సంబంధం స‌హా ప‌లు అంశాల‌పై ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను జగన్ అభిమానిని, హత్యాయత్నం చేయలేదని శ్రీ‌నివాస్ పేర్కొన్నారు.


వైఎస్ జ‌గ‌న్‌పై ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదని శ్రీ‌నివాస్ పేర్కొన్నాడు. నార్కో పరీక్షలకు కూడా సిద్ధమ‌ని ఆయ‌న ప్ర‌క‌టించాడు. ``నాకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదు. సెల్ఫీ తీసుకునేందుకు జగన్ వద్దకు వెళ్లాను. నా వద్ద ఫ్రూట్ సలాడ్ కత్తి మాత్రమే ఉంది. దాడి ఘ‌ట‌న అనుకోకుండా జరిగింది`` అని జనుపల్లి శ్రీనివాసు పేర్కొన్నాడు. త‌న సోదరుడు, లాయర్‌తో కలిసి స్వగ్రామం ముమ్ముడివరం మండలం ఠాణేలంక శ్రీనివాస్ వెళ్లిపోయారు. 


అయితే, జైల్ నుంచి విడుదల తర్వాత మీడియాతో శ్రీనివాస్  తెలివిగా మాట్లాడినట్లు ప‌లువురు పేర్కొంటున్నారు. శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం చేస్తున్న వ్యాఖ్య‌లు ఆయ‌న‌కు ముందుగానే ప‌లువురు చేసిన ఫీడ్ బ్యాక్ ప్ర‌కారం ఉన్నాయ‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. జ‌గ‌న్‌పై దాడి అంశాన్ని దారి మ‌ళ్లించేందుకే ఈ ర‌కంగా మాట్లాడించేలా ముంద‌గానే సూచ‌న‌లు చేశార‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రోమారు స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేస్తే...పూర్తి నిజాలు తెలుస్తాయ‌ని విశ్లేషిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: