ఏపిలో ఇప్పుడు రాజకీయా వాతావరణంలో అనూహ్య మార్పులు వచ్చాయి.  మొన్నటి వరకు గెలుపు ధీమా వ్యక్తం చేసిన టీడీపీ, జనసేన పార్టీల్లో అతి కష్టం మీద టీడీపీ..అట్టర్ ఫ్లాప్ లో జనసేన స్థానాలు గెల్చుకున్నాయి. 175 కి 150 స్థానాలతో వైసీపీ విజయదుంధుభి మోగించింది.  ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ని పలువురు సీనియర్ అధికారులు...నాయకులు..వేద పండితులు అందరూ కలిసి అభినందనలు తెలుపుతున్నారు.  


ఇప్పటికే జగన్ కి భారీ భద్రతా ఏర్పాట్లు..కాన్వాయ్ లు ఏర్పాటు చేశారు.  కాగా, వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి శనివారం సాయంత్రం అయిదు గంటలకు హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ తో మర్యాద పూర్వకంగా భేటీ అవబోతున్నట్లు సమాచారం.   


భేటీ లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఈ నెల 30వ తేదీన విజయవాడలో జరిగే తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా రావాలని కోరుతూ ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేయనున్నారు. 

సాయంత్రం 4.30కి జగన్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ  అయి శాసనసభ పక్షసమావేశం వివరాలు అందచేస్తారు. సీఎం కేసీఆర్‌ను,  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ను కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రమాణ స్వీకారం గురించి కేసీఆర్ కు ఫోన్ లో వివరించి జగన్ ఆహ్వానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: