వైసిపి సాధించిన అఖండ విజయంపై అనేక మంది అనేక రకాల విశ్లేషణలు ఇస్తున్నారు. సరే ఏ విశ్లేషణ ఎలాగున్నా ఒకటి మాత్రం నిజమని అందరికీ అర్ధమైపోయింది. అదేమిటంటే చంద్రబాబునాయుడు మీద జనాల్లో పెరిగిపోయిన కసి, అసంతృప్తి, టిడిపి ప్రజా ప్రతినిధులపై జనాల్లో పెరిగిపోయిన ఏహత్యభావమే జగన్ ఈరోజు హీరోగా నిలబెట్టాయి.

 

2014లో అధికారంలోకి వచ్చింది మొదలు చంద్రబాబు అనైతిక రాజీకాయాల్లోనే ముణిగిపోయారు. ఫిరాయింపులను ప్రోత్సహించటం, వైసిపి ప్రజా ప్రతినిధులను ఎక్కడికక్కడ అణిచివేయటం, వైసిపి నేతలను జైళ్ళల్లో పెట్టించటం లాంటి అప్రజాస్వామిక చర్యలు పాల్పడ్డారు. అసెంబ్లీలో జగన్మోణన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని అమ్మనాబూతులు తిట్టటాన్ని అందరూ చూసిందే. దాని ఫలితంగానే జగన్ అసెంబ్లీకి కాకుండా పాదయాత్ర అంటూ నేరుగా జనాల్లోకే వెళ్ళిపోయారు.

ఎప్పుడైతే జగన్ పాదయాత్ర మొదలుపెట్టారో జనాలు కూడా సానుకూలంగా స్పందించారు. పాదయాత్రలో జగన్ కు జనాలు బ్రహ్మరథం పట్టారంటేననే చంద్రబాబుపై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్ధమైపోతోంది. చంద్రబాబు ఏమాత్రం బ్యాలెన్సుడుగా ఉన్నా జగన్ పాదయాత్రంటూ జనాల్లోకి వెళ్ళేవారు కారేమో. అంటే జగన్  పాదయాత్ర చేసేట్లుగా చంద్రబాబు  పరిస్ధితులు కల్పించినట్లైంది. పాదయాత్రే వైసిపి గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది.

 

జగన్, వైసిపి నేతలను రాచరంపాన పెట్టటం ఓ ఎత్తైతే మామూలు జనాలపైకి కూడా టిడిపి నేతల ధాష్టికాలు మితిమీరిపోయాయి. అధికారులపై దాడులు చేయటం, తామంటే గిట్టని మామూలు జనాలను కూడా ఇబ్బందులకు గురిచేయటం, అవినీతి, అరాచకాలు ఆకాశం అంత ఎత్తుగా పెరిగిపోయాయి. అంటే మంత్రులు, ఎంఎల్ఏల అవినీతి, అరాచకాలను చంద్రబాబు కూడా నియంత్రించలేని స్ధాయికి చేరుకున్నాయి.

 

పార్టీతో పాటు ప్రభుత్వం మీద కూడా చంద్రబాబు నియంత్రణ కోల్పోయారు. దాంతో అరాచకం పెరిగిపోయింది. ఆ అరాచకాన్నే జనాలు భరించలేకపోయారు. జనాల్లో పెరిగిపోయిన అసంతృప్తి, కసిని చంద్రబాబు కూడా గుర్తించలేకపోవటంతో ఇపుడు ఫలితం అనుభవిస్తున్నారు. విజయనగరం, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో టిడిపికి ఒక్క సీటు కూడా లేదంటే వ్యతిరేకత ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

 

వైసిపి అభ్యర్ధుల్లో కనీసం 40 మందికి 35 వేల నుండి 60 వేల మధ్యలో మెజారిటీలు వచ్చాయంటే జనాలు ఏ స్ధాయిలో టిడిపి అభ్యర్ధులను అసహ్యించుకున్నారో అర్ధమైపోతోంది.  వెలువడిన ఫలితాలను బట్టి జనాల సానుకూలత జగన్ విషయంలో 40 శాతముంటే చంద్రబాబుపై కసి, ఏహ్యతా భావం 60 శాతం ఉన్నట్లు తెలిసిపోతోంది. అంటే జగన్ ను చంద్రబాబే హీరోను చేశారని అర్ధమైపోతోంది. ఎవరికైనా ఎనీ డౌట్ ?


మరింత సమాచారం తెలుసుకోండి: