కర్నూలు జిల్లాలోని బనగానపల్లె నియోజకవర్గంలో ఎన్నికల పోరు చాలా హోరాహోరీగా సాగింది. వైసీపీ మరియు టీడీపీ పార్టీలు ఇక్కడ ఆధిక్యం కోసం నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి.
ఈ నియోజకవర్గంలో వైకాపా నుండి కాటసాని రామిరెడ్డి బరిలోకి దిగాడు. తెలుగు దేశం పార్టీ నుండి బీసి జనార్ధన్ రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

అయితే రాష్ట్రం అంతటా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగినట్లే, ఇక్కడ కూడా చివరికి విజయ లక్ష్మి కాటసాని నే వరించింది. కాటసాని రామిరెడ్డికి మొత్తం 99,998 మంది ప్రజలు తమ మద్దతును తెలిపారు. అయితే జనార్ధన్ అంత తేలికగా ఏమి తన ఓటమిని ఒప్పుకోలేదు. ఇతను మొత్తం 86,614 ఓట్లు సాధించి, 13,384 ఓట్లతో ఓడిపోయాడు. 

దీంతో వైసీపీ శిబిరంలో సందడి మొదలైంది. ఇక్కడ బీసీ జనార్ధన్ కు మంచి పేరు ఉన్నా కూడా ప్రజలు జగన్ పైన నమ్మకం ఉంచి వైసీపీకే మొగ్గు చూపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: