హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించిన రోజా, తెలుగుదేశం పార్టీలో చేరి అప్పట్లో ఎమ్మెల్యేగా పోటీ చేసింది.  కానీ, ఓటమిలాపయ్యింది.  ఆ తరువాత తెలుగుదేశం నుంచి వైకాపాలో చేరిన రోజా నగరి నుంచి పోటీ చేసి విజయం సాధించింది.  నగరి నుంచి మొదటిసారి పోటీ చేసి విజయం సాధించిన తరువాత రోజా టిడిపి గురించి చాలా వ్యాఖ్యలు చేసింది.  టీడీపీలో ఉండగా తనను చాలా మంది చాలా మాటలు అన్నారని చెప్పిన సంగతి తెలిసిందే.  తెలుగుదేశం పార్టీ వాళ్ళే అప్పట్లో తనకు వ్యతిరేకంగా పనిచేశారని చెప్పి సంచనలం సృష్టించింది.

నగరి నుంచి విజయం సాధించి మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన రోజాకు అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయి.  రోజాను మాట్లాడనివ్వకుండా టిడిపి అడ్డుకుంది.  ఏకంగా ఆమెను సభనుంచి శాశ్వతంగా బహిష్కరించింది.  దీంతో రోజా అసెంబ్లీకి వెళ్లలేకపోయింది.  ఇది రోజాకు ఊహించని షాక్.  టిడిపి ఏకపక్షంగా ప్రవర్తించి అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వలేదని ఆవేదన చెందింది.  


ఇదిలా ఉంటె, 2019 లో రోజా మళ్ళీ నగరి నుంచి పోటీచేసి భారీ విజయం సొంతం చేసుకుంది.  అంతేకాదు వైకాపా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.  ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించింది.  ఎవరికి ఎలాంటి పోస్ట్ ఇస్తున్నారు అనే దానికంటే రోజాకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వబోతున్నారు అనే దానిపైనే అందరి దృష్టి నిలిచింది.  రోజాకు మొదట విద్యుత్ శాఖ ఇవ్వబోతున్నారని వార్తలు వచ్చాయి.  కానీ, ఇప్పుడు రోజాకు స్పీకర్ పదవి ఇవ్వబోతున్నారని, టిడిపికి బుద్ది చెప్పాలంటే ఆమెకు ఆ పదవి ఇవ్వడమే సబబని వైకాపా భావిస్తున్నట్టు సమాచారం.  ఇదే నిజమైతే... టిడిపి సభలో ఎలాంటి ఇబ్బందులు పడబోతుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: