ఏపీ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో శ‌నివారం హైద‌రాబాద్‌లో స‌మావేశం అయిన సంగ‌తి తెలిసిందే. జగన్ శనివారం సాయంత్రం గవర్నర్‌తో భేటీ అనంతరం సతీసమేతంగా ప్రగతిభవన్‌కు వచ్చారు. వారికి ముఖ్యమంత్రి పుష్పగుచ్ఛాలిచ్చి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. జగన్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని.. అనూహ్య విజయం సాధించినందుకు హృదయపూర్వకంగా అభినందించారు. ఈ నెల 30న విజయవాడలో జరుగనున్న తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి వెళ్ల‌డం లేద‌ని అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.


జగన్మోహన్‌రెడ్డితో కొద్దిసేపు రెండు రాష్ర్టాల సంబంధాలపై చర్చించిన సీఎం కేసీఆర్.. ఇరుగుపొరుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం మంచిదని తాము మొదటినుంచి భావిస్తున్నామని చెప్పారు. ఇరుగు పొరుగు రాష్ర్టాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం తమ విధానమని కేసీఆర్ ఈ సంద‌ర్భంగా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో కూడా అదే పంథాను అవలంబిస్తామని స్పష్టంచేశారు. గోదావరి, కృష్ణా నదీజలాలను సమర్థంగా ఉపయోగించుకుంటే రెండు రాష్ర్టాలు సుభిక్షంగా ఉంటాయని తెలిపారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ సైతం ఇదే భావ‌న వ్య‌క్తం చేశారు. త‌న ప్ర‌మాణ స్వీకారం గురించి ఆయన వివ‌రించారు. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి వెళ్ల‌డం లేద‌ని తెలుస్తోంది. 


తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి వెళ్ల‌డాని ఫిఫ్టీ-ఫిఫ్టీ అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌మాచారం. ఎందుకంటే, ఈనెల 30న రెండోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయన్నట్టు తెలిసింది. సాయంత్రం ఉంటే తొలుత ఏపీ సీఎం జగన్మోహన్‌‌‌‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి కేసీఆర్‌‌‌‌ హాజరై ఢిల్లీ వెళ్లే అవకాశముంది. మధ్యాహ్నమే ఉంటే 29న సాయంత్రమే కేసీఆర్‌‌‌‌ ఢిల్లీ వెళ్తారని సమాచారం. ఏపీ సీఎం ప్రమాణ స్వీకారానికి పార్టీ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌ సహా పలువురు మంత్రులు హాజరవనున్నట్టు తెలిసింది. ఒక‌ట్రెండు రోజుల్లో ఈ విష‌య‌మై పూర్తి స్ప‌ష్ట‌త రానున్న‌ట్లు స‌మాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: