ఊహించ‌ని రెస్పాన్స్‌. గంభీరంగా క‌నిపించే ప్ర‌ధానిలో ప‌ట్ట‌లేని సంతోషం..,జ‌గ‌న్ ప్ర‌ధానిని మెప్పించారు. జ‌గ‌న్ త‌న కార్యాల‌యంలోకి రాగానే మెదీ మొములో సంతోషం కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించింది..  చంద్ర‌బాబును ఓడించి ఏపీ సీఎం కాబోతున్న జ‌గ‌న్‌ను ఆలింగ‌నం చేసుకున్నారు. శ‌బాష్ అన్నారు.భుజం త‌ట్టి అభినందించారు. నేనున్నానంటూ హామీ ఇచ్చారు. తొలుత గంట సేపు బేటీ అనుకున్న అప్పాయింట్‌మెంట్ స‌మ‌యం...దాటిపోయినా జ‌గ‌న్‌కు కేటాయించారు . ఏపీలోని యధార్ధ ప‌రిస్థితిని వివ‌రించారు. అండ‌గా నిల‌వ‌మ‌ని జ‌గ‌న్ అభ్య‌ర్దించారు. నేనున్నానంటూ ప్ర‌ధాని హామీ ఇచ్చారు.


మోదీ-జ‌గ‌న్‌ ప‌ర‌స్ప‌ర అభినంద‌న‌లు..!
ఏపీకి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్న జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లారు. ప్ర‌ధాని మోదీతో స‌మావేశం అయ్యారు.  ప్ర‌ధాని త‌న‌ వ‌ద్ద‌కు వ‌చ్చిన జ‌గ‌న్‌ను అలింగ‌నం చేసుకున్నారు..అనూహ్య విజ‌యం సాధించినందుకు అభినందించారు. తాను.. 30న ప్ర‌మాణ స్వీకారం చేస్తున్నాన‌ని ఆ కార్య‌క్ర‌మానికి రావాలని జ‌గ‌న్ ప్ర‌ధానిని ఆహ్వానించారు.


అదే రోజు తాను ప్రమాణ స్వీకారం చేస్తున్నాన‌ని ..ఏపీలో మ‌రో కార్య‌క్ర‌మం ఏర్పాటు చేయండి.. త‌ప్ప‌క వ‌స్తానంటూ హామీ ఇచ్చారు. ఏపీలో ఉన్న ప‌రిస్థితుల‌ను ప్ర‌ధానికి సుదీర్ఘంగా జ‌గ‌న్ వివ‌రించ‌గా..ప్ర‌ధాని ఆల‌కించారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం రాష్ట్ర ఆర్దిక ప‌రిస్థితి.. కేంద్రం నుండి అమ‌లు కావాల్సిన పెండింగ్ హామీలతో కూడిని నివేదిక జ‌గ‌న్‌తో క‌లిసి ప్ర‌ధానికి వివ‌రించారు. తొలుత గంట అనుకున్న స‌మావేశం గంట‌న్నార సేపు కొన‌సాగింది.


నేనున్నానంటూ మోదీ భ‌రోసా..!
రాష్ట్రంలో కొత్త‌గా తాను బాధ్య‌త‌లు చేప‌డుతున్నాన‌ని.. ఏపీ ప్ర‌జ‌లు ఎన్నో ఆశ‌లతో ఉన్నార‌ని జ‌గ‌న్ త‌న భేటీలో మోదీకి వివ‌రించారు. తాము ఎంత చేసినా..మాజీ ముఖ్య‌మంత్రి త‌మ పైన రాజ‌కీయంగా బుర‌ద జ‌ల్ల‌టం కోస‌మే అబ‌ద్దాలు ప్ర‌చారం చేసార‌ని వ్యాఖ్యానించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఏపీ లక్షా 60 వేల కోట్ల అప్పుల‌తో ఉంద‌ని.. ప్ర‌స్తుతం 24 వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని..ప్ర‌తీ నెలా ఓడికి వెళ్లి జీతాలు చెల్లించాల్సి వ‌స్తుంద‌ని జ‌గ‌న్ త‌న నివేదిక‌లో ప్ర‌ధానికి వివ‌రించారు. కేంద్రం ఆదుకోకుంటే ఏపీకీ ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అభ్య‌ర్దించారు. 


అన్నీ అంశాలు విన్న ప్ర‌ధాని తాము ఎప్పుడూ ఏపీకీ అండ‌గా నిలిచామ‌ని.. ఇప్పుడూ త‌మ వంతు సాయం త‌ప్ప‌క అందిస్తామ‌ని మోదీ హామీ ఇచ్చారు. ఏపీకీ ఏ స‌మ‌స్య వ‌చ్చినా తాము అండ‌గా నిలుస్తామ‌ని..ఏపీ అభివృద్దికి చిత్త‌శుద్దితో స‌హ‌క‌రిస్తామ‌ని స్ప‌ష్టం చేసారు.

జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి మోదీ ప్ర‌తినిధి..!
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌జ‌లంతా ఎదురు చూస్తున్నార‌ని..వారి ఆశ‌ల‌ను నెర‌వేర్చాల‌ని జ‌గ‌న్ విన‌యంగా ప్ర‌ధానిని కోరారు. అయితే, ప్ర‌ధాని మోదీ నో అని మాత్రం చెప్ప‌లేద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారానికి త‌మ ప్ర‌తినిధిని పంపిస్తామ‌ని మోదీ హామీ ఇచ్చారు. ప్రమాణ స్వీకారం త‌రువాత మ‌రింత స్ప‌ష్ట‌మైన వివ‌రాల‌తో మ‌రో సారి రావాల‌ని ఆహ్వానించారు. 


ఆ భేటీలో స్ప‌ష్ట‌మైన రూట్ మ్యాప్‌తో ముందుకు వెళ్ధామ‌ని ప్ర‌తిపాదించారు. త‌న కార్యాల‌యంలో ఏపీ వ్య‌వ‌హారాలు సీనియ‌ర్ అధికారికి కేటాయిస్తామ‌ని..త‌ప్ప‌కుండా పూర్తి స‌హ‌కారం అందిస్తామంటూ మోదీ స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: