ఏపీ కాబోయే ముఖ్యమంత్రి జగన్ కేసీఆర్ ను ఫాలో అవుతున్నారా.. కొన్ని విషయాల్లో ఈ అనుమానం కలుగుతోంది. గతంలో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో ఎన్నో హామీలు ఇచ్చేవారు. అలా ఇచ్చిన హామీలు పూర్తి చేయకపోతే మళ్లీ ఓట్లు అడగటానికి రానని చెప్పేవారు. తెలంగాణలో మిషన్ భగీరథ నీళ్ల విషయంలో కేసీఆర్ ఇలాంటి హామీయే ఇచ్చారు. 


కానీ ఆ హామీని ఆయన నిలబెట్టుకోలేకపోయారు. అయితే మిషన్ భగీరథ విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధిని జనం అర్థం చేసుకున్నారు. అందుకే మళ్లీ ఎన్నికల్లో గెలిపించారు. ఇప్పుడు వైఎస్ జగన్ కూడా అదే రూట్ లో వెళ్తున్నారు. ఢిల్లీలో ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడిన జగన్.. మధ్యపాన నిషేధం విషయంలో కేసీఆర్ తరహాలోనే మాట్లాడారు. 

వైసీపీ తన మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం గురించి ప్రస్తావించారు. విడతల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పారు. ఇదే విషయాన్ని ప్రెస్ మీట్ లో ఓ విలేఖరి అడిగారు.. మద్యపాన నిషేధం అమలు చేస్తారా అని నిలదీసినంత పని చేశారు. ఇక్కడ జగన్ కేసీఆర్ రూట్లో జవాబు చెప్పారు. 

ఒకేసారి మద్యపాన నిషేధం అమలు చేయడం కుదరదు. మేనిఫెస్టోలో చెప్పినట్టు విడతలవారీగా చేస్తాం. మళ్లీ ఓట్లు అడిగేందుకు వెళ్లేనాటికి ఫైవ్ స్టార్ హోటళ్లలో తప్ప మిగిలిన చోట్ల మద్యపానం లభించని పరిస్థితి తీసుకొస్తాం.. ఆ పని చేయలేకపోతే.. మళ్లీ ఎన్నికల్లో మహిళల వద్దకు వెళ్లి ఓట్లు అడగను.. అంటూ క్లారిటీ ఇచ్చారు జగన్. చిత్తుశుద్ధితో ప్రయత్నం చేస్తే.. జనం అర్థం చేసుకుంటారన్నది జగన్ దీమా కావచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: