ప్రత్యేక హోదా.. మొన్నటి ఎన్నికల్లో జగన్ కు బంపర్ మెజారిటీ కట్టబెట్టేందుకు కారణమైన అంశాల్లో ఇదీ ఒకటి. హోదా విషయంలో జగన్ మొదటి నుంచీ ఒకటే స్టాండ్ కు కట్టుబడి ఉన్నాడు.. మాట మార్చలేదు.. పోరాటం ఆపలేదు. కానీ అధికారంలోకి రాగానే జగన్ స్వరం మారిపోయిందా..


ఇప్పుడు ఈ కోణంలో టీడీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ ప్రెస్ మీట్ లో ఈ అంశంపై జగన్ స్పందించారు. ఆయన ఇలా అన్నారు..  మన సాయం అవసరం లేకుండా మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలరు. రాష్ట్రాన్ని బాగా నడిపించాలనే తపన, తాపత్రయం ఉంది కాబట్టి అన్ని రకాలుగా సాయం అందించాలని మోదీని కోరాం. 

ప్రత్యేక హోదా అనే అంశంపై  ఫైల్‌పై సంతకం పెట్టే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్‌ హక్కు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు హోదా అమలు చేస్తామని చెప్పారు. ఇది మనం వదిలివేస్తే ఆ తరువాత ఎప్పుడూ ఇవ్వరు. ఎవరూ పట్టించుకోరు. హోదా ఒక్కటే అనుకుంటూ రాష్ట్రంలో ఆర్థిక సమస్య కూడా ఉంది.

రాష్ట్రం బాగుపడాలంటే వారి సహాయ సహకారాలు కావాలి. ఒకసారితో ఆగిపోదు ఐదు సంవత్సరాల కాలంలో ఇంకా అనేక సార్లు ప్రధానిని కలుస్తాను. కానీ, కలిసిన ప్రతిసారీ ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు ప్రతి రోజు అడుగుతూనే ఉంటా. హోదా కచ్చితంగా వస్తుంది.. ఇలా స్పందించారు జగన్. 

ఇప్పుడు ఈ స్టాండ్ పై టీడీపీ సోషల్ వింగ్ దాడి మొదలెట్టింది. గత ఐదేళ్లుగా చంద్రబాబు చెబుతున్నది ఇదే కదా.. అంటూ కౌంటర్లు మొదలు పెట్టారు. గతంలో చంద్రబాబు మాట్లాడిన మాటలు. హోదా కోసం జగన్ చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. ఐతే... హోదా కోసం జగన్ చిత్తశుద్ధితో పని చేస్తే.. అది వచ్చినా రాకపోయినా జనం పట్టించుకోరన్నది కొందరి వాదన. 


మరింత సమాచారం తెలుసుకోండి: