మద్యపానం నిషేధం ఇది ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఒక సవాలు లాంటిందని చెప్పాలి. ఎందుకంటే ఇది చెప్పినంత ఈజీ వ్యవహారం కాదు. తన పార్టీ మేనిఫేస్టోలో పేర్కొన్నట్లుగా దశల వారీ మద్యపాన నిషేధానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి. అందులో  భిన్నమైన అంశాల్ని ప్రస్తావించిన ఆయన.. రెండింటి విషయంలోనూ ఒకేలాంటి కమిట్ మెంట్ ను ఆయన ప్రదర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్న ఆయన దాన్ని సరి చేస్తామని చెబుతూనే.. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన దశల వారీ మద్యపాన నిషేధాన్ని 2024 నాటికి పూర్తి చేస్తామన్న సంచలన ప్రకటన చేశారు.


ఇవాల్టి రోజున రాష్ట్ర ప్రభుత్వాలు బతికేస్తున్నాయంటే వాటికి రెండు రకాల ఆదాయాల మీదనే నిలుస్తోంది. అందులో ఒకటి పెట్రోల్.. డీజిల్ మీద వచ్చే ఆదాయం.. రెండోది మద్యం మీద విధించే పన్ను మీద వచ్చే ఆదాయం. ఇతర పన్నులు ఎన్ని ఉన్నా.. ఈ రెండింటి మీద వచ్చే ఆదాయం భారీగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగోనప్పుడు.. బంగారు బాతుగుడ్డు లాంటి మద్యం మీద వచ్చే ఆదాయాన్ని పాలకులు మిస్ చేసుకుంటారా? అంటే లేదని చెప్పాలి.


కానీ.. జగన్ మాత్రం అందుకు భిన్నంగా తాను ఆ పని చేస్తానని చెప్పటం ఆసక్తికరం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పినప్పుడు.. ఎన్నికల సందర్భంగా తానిచ్చిన దశలవారీ మద్యపాన నిషేధం మీద తన హామీని సడలించుకుంటారన్న అభిప్రాయం కలుగుతుంది. కానీ.. అందుకు భిన్నంగా 2024 ఎన్నికలకు వెళ్లేటప్పుడు మద్యపానాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకు పరిమితం చేస్తానన్న స్వీయ డెడ్ లైన్ పెట్టుకున్న తీరు చూస్తే.. జగన్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: