అపుడపుడు మీడియాలో కనిపించి, మాయమయ్యే ఈ స్వయం ప్రకటిత మేధావి జగన్‌ అధికారంలోకి రాగానే బయటకు వచ్చి, తెలుగు జాతికి ధర్మ సందేశాలు ఇవ్వడం మొదలు పెట్టాడు.

గత ఐదేళ్లలో తెలుగు దేశ పాలనలో కులం పచ్చ చొక్కాలేసుకొని తిరిగినా పట్టించుకోని లోక్‌సత్తా జయప్రకాశ్‌ నారాయణ ఇపుడు తాజా కులరహిత సమాజం కోసం ఉధ్యమం చేస్తామంటున్నాడు. కులరహిత సమాజం కావాల్సిందే అని పత్రికా స్టేట్‌ మెంట్స్‌ ఇస్తున్నాడు.

 మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు తన పార్టీని గెలిపించుకోవడానికి చేసిన వ్మూహాలలో కులం పాత్ర తిరుగులేనిది. తను చుట్టూ ఉన్న అదికారులలో సైతం తన సామాజిక వర్గం వారు ఉండేలే జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విషయం గురించి వైసీపీ ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది కూడా... ఇలాంటి పరిస్దితుల్లో మేధావి జయప్రకాశ్‌ నారాయణ నోరు మెదపు లేదు. చంద్రబాబు గారూ ఇది అనైతికం అని చెప్పలేక పోయారు

చంద్రబాబునాయుడు గారి సారధ్యంలోని తెలుగుదేశం పార్టీ తమ పార్టీ పదవులలో గాని, నామినేటెడ్‌ పదవులలో గాని, శాసన సభ ఎన్నికల పోటీ నిమిత్తం ఎంపిక చేసిన అభ్యర్ధులలోగాని, గెలిచాక మంత్రి పదవులను ఇవ్వడములో గాని కుల రహితముగా ప్రాధాన్యత ఇవ్వడములో కట్టుపడిందా???

అన్నిటా తన కులము వారికే ప్రాధాన్యత ఇచ్చి కమ్మ సామాజికవర్గానికి చెందిన పార్టీగా ముద్రను పొందడములో తెలుగుదేశము పార్టీని ప్రభావితం చేసినవారు తమరి కులానికే చెందిన చంద్రబాబు కాదా??? ... శ్రీమాన్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ గారు ... అప్పుడు తమరికి కులరహిత రాజకీయాలు అనే పదమే తెలియదు కాబోలు??? చెప్పేవి శ్రీరంగ నీతులు ... దూరేవి......... అనే నానుడి తమలాంటి వారిని చూసే చెప్పి ఉంటారు కాబోలు .. అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: