స్టీఫెన్ రవీంద్ర పేరు గురించి చెప్పగానే..అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి..సీతయ్య ఎవరి మాటా వినడు అనే టైప్ లో ఎలాంటి ప్రలోభాలకు రాజకీయ వత్తిళ్లకు తలొగ్గని సిన్సియర్ పోలీస్ ఆపీసర్ గా పేరు తెచ్చుకున్నారు స్టీఫెన్ రవీంద్ర. 1990 బ్యాచ్‌కు చెందిన రవీంద్ర... సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. ఇటీవల తెలంగాణలో చోటు చేసుకున్న ఐటీ గ్రిడ్ చోరీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇంఛార్జ్‌కు కూడా స్టీఫెన్ రవీంద్ర .

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన ఐజీ స్టీఫెన్ రవీంద్రకు కొత్త పోస్ట్ తాజాగా కొత్త పోస్ట్ వరించింది. వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి మేరకు ఆయన్ను కేంద్ర హోంశాఖ ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా నియమించింది. రాయలసీమలో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలతో పాటు ఉగ్రవాద, మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో స్టీఫెన్ రవీంద్ర పనిచేశారు. 

తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవ్ కావడానికి మరో 15 రోజులు పట్టే సమయం ఉందని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై కేంద్రానికి లేఖ రాసిన తర్వాత .. పూర్తిస్థాయిలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు.  స్టీఫెన్ రవీంద్ర అనంతపురానికి చెందినవారని అధికారిక వర్గాలు తెలిపాయి. రాజశేఖర్ రెడ్డికి చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్‌‌గా పని చేయడంతో పాటు.. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా కూడా ఆయనకు పేరుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: