తెలుగు రాజకీయాల్లో సెంటిమెంట్లకు కొదవేలేదు. ఒక్కోసారి ఒక్కో విధమైన సెంటిమెంట్ నడుస్తూ ఉంటుంది. ఒక్కో పార్టీకి,  ఒక్కో రాజకీయ నాయకుడు ఒక్కో సెంటిమెంటుతో హిట్ అవ్వడం.. లేదా ఫస్ట్ జరుగుతూ ఉంటుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయంతో ఇప్పుడు ఆ పార్టీలో ఓ నెంబర్ ఎవరికి అచ్చిరాద‌న్న విషయం మరోసారి  తెరమీదకు వచ్చింది. 1983లో తెలుగుదేశం తొలిసారిగా సమైక్య రాష్ట్ర ఎన్నిక‌ల్లో పోటీ చేసింది.  నేటి తాజా ఎన్నిక‌ల‌తో పోలిస్తే మొత్తం 9 సార్లు ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లింది. ఈ ఎన్నికల్లో చాలాసార్లు  పార్టీలో నెంబర్-2 పొజిషన్ లో ఉన్న వ్యక్తి  ఓడిపోవటం లేదా రాజ‌కీయంగా ప‌త‌నం కావ‌డం క్రమంగా జరుగుతూ వస్తోంది.


ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన నెంబర్-1 పొజిషన్ లో ఉంటే రెండో స్థానంలో  అప్పటి ఆర్థిక మంత్రి నాదెండ్ల భాస్కరరావు ఉండేవారు. పేరుకు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాన వ్యవహారాలన్నీ నాదెండ్ల కనుసన్నల్లోనే నడిచేవి. ఆ తర్వాత నాదెండ్ల ఏకంగా ఎన్టీఆర్‌పైనే తిరుగుబాటు చేసి రాజకీయంగా ఆ తర్వాత పతనమైపోయారు. 1989లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా, 1998లో ఖ‌మ్మం ఎంపీగా గెలిచినా ఆ తర్వాత రాజకీయాల్లో నాదెండ్ల తనదైన ముద్ర వేయలేకపోయారు అన్నది వాస్తవం. పార్టీలో నాదెండ్ల తిరుగుబాటు తరువాత నెంబర్-2 స్థానంలో  ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి హరికృష్ణ కొన్ని రోజులు ఉన్నారు. హరికృష్ణ రాజకీయపరమైన కార్యక్రమాల కంటే ఎన్టీఆర్ వ్యవహారాలన్నీ చూసేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. బాలయ్యను తన నట వారసుడిగా ప్రకటించిన ఎన్టీఆర్ హరికృష్ణను రాజకీయంగా తన తర్వాత స్థానం ఇవ్వాలని ఆరాటపడేవారు. 


పార్టీ ఎప్పుడైతే చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళిపోయిందో ఆ తర్వాత హరికృష్ణ కుటుంబానికి రాజకీయంగా ప్రాధాన్యం లేకుండా పోయింది. ఎన్టీఆర్ 1994 లో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాక పార్టీ పెత్తనం అంతా ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి చేతుల్లోనే ఎక్కువగా ఉండేది. అప్పుడు పార్టీలో నెంబర్-2 స్థానం లక్ష్మీపార్వతిదే అన్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్ మరణం తర్వాత లక్ష్మీపార్వతి రాజకీయంగా కనుమరుగైపోయింది. ఇక చంద్రబాబు హయాంలో అప్పటి హోం మంత్రి దేవేంద్ర‌గౌడ్ నెంబర్-2  పొజిషన్ లో ఉండేవారు. 2009 ఎన్నికలకు ముందు దేవేందర్ గౌడ్ టిడిపిని వీడి ఆ తర్వాత తిరిగి పార్టీలోకి వచ్చి రాజ్యసభకు ఎంపికైనా రాజకీయంగా మాత్రం అగమ్యగోచరం అయిపోయింది. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఆయన తనయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలవలేకపోయారు. 


ఇక  2014 లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక నెంబర్-2 పొజిషన్ లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉండడంతో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకటరావును నియమించారు.  చంద్రబాబు తనయుడు లోకేష్ అంతా తానై వ్యవహరించారు అంటే చంద్రబాబు తర్వాత లోకేష్, కళా వెంకటరావు ఇద్దరే రెండో ప్లేస్‌లో ఉన్నారు. తాజా ఎన్నికల్లో వీరిద్దరు ఘోరంగా ఓడిపోయారు. ఎచ్చెర్లలో కళా వెంకటరావు, మంగళగిరిలో లోకేషన్ ఇద్దరు వైసిపి అభ్యర్థుల చేతిలో ఓడిపోవడం జరిగింది. ఏదేమైనా టిడిపిలో నెంబర్‌-1  పొజిషన్ ఎవరికి క‌లిసి రాదన్న విషయం మరోసారి రుజువైంది. మరి ఈ చంద్రబాబు  తాజా ఫలితాలు సమీక్ష చేసుకున్నాక నెంబర్-2 పొజిషన్ ఎవరికి ఇస్తారో ? చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: