ఏపీలో జగన్ భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ పోటీ ఇచ్చే స్థితిలో కూడా లేక ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఇక్కడే బీజేపీకి ఆశలు రావటం మొదలయ్యాయి.  బిజెపి నేత విష్ణువర్థన్ రెడ్డి చేసిన వ్యాఖ్య సంచలనంగా మారింది. ఓ టీవీ ఛానెల్ ( 10 టీవీ ) చర్చలో విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో కొత్తగా ఏర్పడిన జగన్ ప్రభుత్వానికి కేవలం 6 నెలలు మాత్రమే సమయం ఇస్తామని సహకరిస్తామని.. ఏడో నెల నుంచి మా పార్టీ ని బలోపేతం చేసే దిశగా అవసరమైతే జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని విష్ణు వ్యాఖ్యానించడం సంచలనమైంది. 


ఏపీలో టీడీపీ వీక్ అవుతోంది.. మళ్లీ ఆ పార్టీ బలోపేతం కావడం కష్టం అందుకే ఆ శూన్యత ఆసరాగా చేసుకొని వేగంగా ఎదగడానికి హైకమాండ్ వ్యూహాలు రచిస్తోందని విష్ణు చెప్పకనే చెప్పారు...జగన్ ప్రమాణ స్వీకారం చేయకముందే ఢిల్లీలో రాజధాని రైతులకు భూములు ఎప్పుడు తిరిగిస్తారంటూ ఇరుకున పెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టిన కమలసేన.. ఇప్పుడు భారీ స్కెచ్ వేస్తున్నట్లుంది. 


ఢిల్లీ లో మీడియా సమావేశంలోనూ బిజెపి ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి - ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజులు .. బిజెపి జైత్రయాత్ర ఏపీతోనే ముగిస్తుందని వ్యాఖ్యానించి.. మేం బరిలోకి వస్తున్నామనే సంకేతాలు పంపారు...ఎన్డీఏకు 250 సీట్లు వచ్చి ఉంటే సరిపోయేది మన కర్మ ఎక్కువ సీట్లు వచ్చాయి.. భారీ సీట్లు రావోద్దని ప్రార్థించానని జగన్ వ్యాఖ్యలు చేసి 24 గంటలకు కాకముందే బిజెపి ఏపీ మిషన్ ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది... ఏదేమైనా భారీ మెజార్టీతో వచ్చిన జగన్ ను ఎదుర్కోవడం అంత సులువేం కాదు.. ఈ విషయం బిజెపి నేతలకు తెలుసు.

మరింత సమాచారం తెలుసుకోండి: