అక్కడున్నది జగన్. పీఠమెక్కకుండానే సంచనాలు నమోదు చేసే అరుదైన నేత. ఎన్నికల్లో భాగంగా జగన్ కొత్త జిల్లాలకు హామీలు ఇచ్చారు. ప్రతి పార్లమెంట్ సీట్లో ఒక జిల్లా ఉంటుందని చెప్పారు. దాని ప్రకారం ఇపుడు వేగంగా అడుగులు వేస్తున్నారు. దాంతో సెక్రటేరీయేట్ నుంచి   అన్ని జిల్లాల కలెక్టర్లకు నివేదికలు సిధ్ధం చేయమని ఆదేశాలు జారీ చేస్తున్నారు.


జగన్ కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామని  గతంలో ప్రకటించారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గం ఒక జిల్లా చేస్తామని ఆయన ఎన్నికల హామీలలో తెలిపారు. ఆ ప్రకారం ఇరవై ఐదు జిల్లాలు కాబోతున్నాయి. కొత్తగా ఓ గిరిజన జిల్లాను కూడా ఏర్పాటు చేస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. దీనిని కూడా కలిపితే 26 జిల్లాలు అవుతాయి. ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు  ఆయన ముందుంచనున్నారు.


గతంలో కొత్త జిల్లాల డిమాండ్లు వచ్చినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే జగన్ దూకుడుగా పాలనలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిజానికి విడిపోయిన తెలంగాణాలో 30 జిల్లలు చేసుకున్నారు. పాలనాపరమైన సౌలభ్యం కోసం జిల్లాల ఏర్పాటు అవసరమని చాలా కాలంగా డిమాండ్ ఉంది. దాన్ని పట్టుకున్న వారు  జగన్ ఒక్కడే. కొత్త జిల్లాలు వస్తే రాజకీయం కూడా మారుతుంది. అది అధికార పార్టీకి అనుకూలమవుతుంది కూడా. దీంతో జగన్ వేగంగా అడుగులు వేస్తున్నారు. అతి తొందరలోనే దీని మీద కీలకమైన నిర్ణయం ఉంటుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: