పాలనపై పట్టుబిగించేందుకు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వైఎస్‌ జగన్‌ చర్యలు ప్రారంభించారు.ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో కొనసాగుతున్న నలుగురు ముఖ్య అధికారులను బదిలీ చేస్తూ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీచేశారు.   చంద్రబాబు టీమ్‌ను టార్గెట్ చేస్తూ ఉత్తర్వులు జారీ.

సీఎంవో కార్యాలయంలో చాలా కాలంగా పని చేస్తున్న ఉన్నతాధికారులందరిపై బదిలీ వేటు. ఉత్తర్వులను జారీ చేసిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎం కార్యాలయంలో ఉన్నటువంటి ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్న సతీష్ చంద్రతోపాటు ముఖ్యకార్యదర్శి సాయి ప్రసాద్, కార్యదర్శి గిరిజా శంకర్‌తోపాటు అడుసుమిల్లి రాజమౌళిపై బదిలీ వేటు. 

అంతే కాదు ప్రభుత్వ శాఖల కార్యదర్శులంతా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, విభాగాధిపతులు, అధికారులు తాజా నిబంధనల ప్రకారమే చెల్లింపులు చేయాలని ఆదేశించారు. ధ్రువీకరించిన పనులకు మాత్రమే చెల్లింపులు చేయాలని పే అండ్‌ అకౌంట్స్‌ కార్యాలయానికి సీఎస్‌ స్పష్టంచేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: