ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు జగన్. పాల‌నా ప‌రంగా జ‌గ‌న్ తీసుకుంటోన్న ఒక్కో నిర్ణ‌యం చాలా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అస‌లే తీవ్ర‌మైన లోటు బ‌డ్జెట్‌లో ఉన్న ఏపీలో పొద‌పు సంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌చ్చేలా జ‌గ‌న్ ఆలోచ‌న‌లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అంద‌రి దృష్టి జ‌గ‌న్ కేబినెట్ కూర్పు ఎలా ? ఉంటుంది ? అన్న ఆస‌క్తి నెల‌కొంది. చ‌రిత్ర‌లో క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో వైసీపీ ఏకంగా 151 సీట్లు గెలుచుకుంది. కేబినెట్లో గ‌రిష్టంగా 25 మందికి మాత్ర‌మే ఛాన్స్ ఉంటుంది. 


అయితే మంత్రి ప‌ద‌వి ఆశించే వారి సంఖ్య మాత్రం ఏకంగా 50కు పై మాటే. ఇంత చిన్న వ‌య‌స్సులో సీఎం అయిన జ‌గ‌న్ ఇంత టఫ్ కాంపిటేష‌న్‌లో కేబినెట్ కూర్పు ఎలా ?  చేస్తారు ? అన్న‌ది ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌డం లేదు. మంత్రిపదవుల కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు, ముగ్గురికి కేబినెట్లో చోటు ఇవ్వాల‌ని ఆయ‌న‌పై ఒత్తిళ్లు వ‌చ్చాయంటున్నారు. ఇక ప్ర‌చారంలోనే కొంద‌రికి హామీ ఇచ్చి ఉన్నారు. 


ఏదెలా ఉన్న జ‌గ‌న్ కేబినెట్ కూర్పుపై ఆయ‌న సెట్ చేసుకున్న ఈక్వేష‌న్లు ఇవే అంటూ కొన్ని ఈక్వేష‌న్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ప్రస్తుతం ఏపీలో ఉన్న 13 జిల్లాలను రానున్న రోజుల్లో పాతిక జిల్లాలుగా చేయనున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ మరో జిల్లా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల‌ను క‌లిపి పార్వ‌తీపురం కేంద్రంగా మ‌రో జిల్లా ఏర్పాటు చేస్తాన‌ని జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. 


ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ కొత్త జిల్లాల కాంబినేష‌న్‌ను దృష్టిలో ఉంచుకుని మంత్రి వ‌ర్గాన్ని ఏర్పాటు చేశార‌ట‌. అంటే ప్ర‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికి ఒక మంత్రి త‌ప్ప‌నిస‌రిగా ఉంటార‌న్న మాట‌. ఐదుగురు సీనియ‌ర్ల‌తో పాటు మిగిలిన వారంద‌రూ కొత్త‌గా మంత్రి ప‌ద‌వి చేప‌డుతున్న వారే ఉంటార‌ని... ముగ్గురు మ‌హిళ‌లు కూడా ఉండ‌బోతున్నార‌ని వైసీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.


అయితే పార్ల‌మెంటు జిల్లాల వారీగా మంత్రుల‌ను ఎంపిక చేయాల్సి వస్తే కొన్ని క్యాస్ట్ ఈక్వేష‌న్లు సెట్ అవ్వ‌డం క‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌రి దీనిని జ‌గ‌న్ ఎలా స‌మ‌న్వ‌యం చేస్తూ మంత్రుల‌ను ఎంపిక చేశాడు ? అన్న‌ది చూడాలి. కుల.. మతం.. ప్రాంతాల విషయంలోనూ సమతుల్యత మిస్ కానట్లుగా జగన్ పక్కా కాంబినేషన్ తో లిస్ట్ తయారు చేసినట్లుగా తెలుస్తోంది. రెడ్ల‌కు పెద్ద పీఠ వేస్తూనే ఎస్సీల్లో మాదిగ‌, మాల‌, ఇద్ద‌రు క‌మ్మ‌లు, వైశ్య‌, మైనార్టీల‌కు కూడా ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇక స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్ విష‌యంలో జ‌గ‌న్ ఎవ్వ‌రూ ఊహించ‌ని వ్య‌క్తుల‌ను ఎంపిక చేశార‌ట‌.



మరింత సమాచారం తెలుసుకోండి: