ఏపీలో ప్రత్యేక హోదా ఈ రోజు ఈ స్థితిలో ఉందంటే దానికి జగన్ చేసిన పోరాటాలే కారణంగా చెప్పాలి. అయిదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉన్న జగన్ హోదా నినాదం అందుకుని వాడవాడలా వినిపించారు. యుభేరీలు మోగించి యువతను సన్న‌ద్ధం చేశారు. ఇపుడు అధికారంలో ఉన్నారు. కేంద్రంలోకి మోడీని ఒప్పించి హోదాను తీసుకురావాలన్నది జగన్ ప్లాన్ గా ఉంది.


ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకుండానే ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీకి హోదా అవసరాన్ని నొక్కి చెప్పిన జగన్ ఇపుడు సీఎం హోదాలో మొదటిసారి డిల్లీ వెళ్తున్నారు. ఈ నెల 5న జరిగే నీతి అయోగ్ లో హోదా విషయాన్ని ప్రస్తావించడానికి జగన్ సన్నధ్ధమవుతున్నారు. హోదా ఏపీకి ఎంతటి అవసరమో విప్పి చెప్పనున్నారు.


హోదా సాధన దిశగా పకడ్బందీ కార్యాచరణను రూపొందించే పనిలో జగన్  పడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి స్థాయి నివేదికలు రూపొదించాలని ఆయన  అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సదరు నివేదికలను 15వ ఆర్ధిక సంఘం ముందు పెట్టి... ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనన్న వాదనను బలంగా వినిపిద్దామని ఆయన అధికారులకు సూచించారు.


మొత్తంగా పక్కా నివేదికలు వాస్తవిక పరిస్థితులను ఉదహరిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమన్న విషయాన్ని ఇటు కేంద్రంతో పాటు అటు 15వ ఆర్థిక సంఘం ముందు పెట్టి పోరాటం చేసేందుకు జగన్ సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి హోదా వస్తుందా రాదా అన్నది చూడాలిపుడు
             


మరింత సమాచారం తెలుసుకోండి: