అసెంబ్లీ  ఎన్నిక‌ల ముందు ఓట్ ఆన్ అకౌంట్‌తో శాసనసభ  స‌మావేశాలు ముగియాగ,  ఇక  ఇప్పుడు కొత్త అసెంబ్లీ ఈ నెల 12లోగా కొలువు తీరాల్సి ఉంది. తొలి శాస‌న‌స‌భ‌కు సంబంధించి ఈనెల 8న జ‌రిగే కేబినెట్ స‌మావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారికంగా తేదీలు ప్రకటించే అవకాశముంది.  అయితే ఈ స‌మావేశాల‌కు ప్ర‌తిప‌క్ష నేత హోదాలో చంద్ర‌బాబు హాజర‌య్యే ప‌రిస్థితి క‌నిపించం లేదు.

ఈ నెల‌ 12  వ తేదీ నుంచి రెండు రోజులపాటు ,  ఏపీ అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం సమాయత్తమవుతోంది. అయితే, టీడీపీఎల్పీ నేత‌గా ఎన్నికైన చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నేత‌గా దాదాపుగా  ఎన్నికైన‌ట్లేనని, అయినా ఆయన  ఈ స‌మావేశాల‌కు హాజరయ్యే అవకాశాలు ఎంతమాత్రం లేవని తెలుస్తోంది .

చంద్ర‌బాబు తొలి స‌మావేశాల‌కు హాజ‌రు కాక‌పోవ‌టం వెనుక అస‌లు కార‌ణం ఏమిటనేది  ఇప్పుడు చర్చ‌నీయాంశంగా మారింది. ఈనెల  7వ తేదీన చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి సింగ‌పూర్ వెళ్తున్నారు. తిరిగి 14వ తేదీన తిరిగి అమారావ‌తి చేరుకుంటారు.

దీంతో తొలి అసెంబ్లీ స‌మావేశాల‌కు ఆయ‌న అందుబాటులో ఉండే అవ‌కాశం లేదు. ఈ నెల‌ 12 నుంచే  ఏపీ అసెంబ్లీ తొలి విడ‌త సమావేశాల నేపధ్యం లో చంద్రబాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తుండ‌టం చూస్తే, జగన్ ముఖ్యమంత్రి కావడం వల్లే ఆయన ఉద్దేశ్యపూర్వకంగానే విదేశాలకు వెళ్తున్నారన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఏపీలో తిరిగి  తమదే విజ‌యం ఖాయ‌మని  చంద్ర‌బాబు చాలా ధీమాగా ఉన్నారు. అయితే ఫ‌లితాలు మాత్రం టీడీపీకి పూర్తి నిరాశనే  మిగిల్చాయి. ఊహించ‌ని ఫ‌లితాల‌తో చంద్ర‌బాబు సైతం కంగు తిన్నారు.

 అస‌లు జ‌గ‌న్‌కు ఎందుకు ఓటు వేస్తార‌ని తొలుత  ప్ర‌శ్నించిన చంద్ర‌బాబు, ఆ త‌రువాత జ‌గ‌న్ పైన సానుభూతితోనే ఓట్లు వేశార ని, త‌మ పైన వ్య‌తిరేక‌త‌తో కాద‌ని చెప్పుకొచ్చారు. ఇక‌, తొలి అసెంబ్లీ సమావేశాల్లో తొలుత ముఖ్య‌మంత్రి హోదా లో జ‌గ‌న్‌, ఆ త‌రువాత ప్రతిప‌క్ష నేత హోదాలో చంద్ర‌బాబాబు ఎమ్మెల్యేలుగా ప్ర‌మాణం చేయాల్సి ఉండడం వల్లే , ఆలా చేయటం ఇష్టం లేకనే చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారనే  వాద‌న రాజకీయవర్గాల్లో విన్పిస్తున్నాయి . అయితే ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదని ముందస్తుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారమే బాబు విదేశీ ప్రర్యటనకు వెళ్తున్నారని తమ్ముళ్లు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: