ప‌రిపాల‌న సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా క్షేత్ర‌స్థాయి నుంచి మార్పుల‌కు శ్రీ‌కారం చుడుతున్న వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మంగ‌ళ‌వారం పెద్దసంఖ్యలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరగ‌గా...ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.  దీంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 23 మంది ఐపీఎస్‌లకు తాజాగా స్థాన‌చ‌ల‌నం జ‌రిగింది.
బ‌దిలీల వివ‌రాలివి
తూర్పుగోదావరి ఎస్పీ-నయీ హష్మీ
ఆక్టోపస్ ఎస్పీ-విశాల్ గున్నీ
ఎస్ ఐ బీ ఎస్పీ- రవిప్రకాష్
సీఐడి డిఐజీ- త్రివిక్రమ్ వర్మ
ఏలూరు డీఐజీ-ఏ ఎస్ ఖాన్
కర్నూల్ డీఐజీ-టి వెంకట్రామిరెడ్డి
విజయనగరం ఎస్పీ-బి రాజకుమారి
గుంటూరు అర్బన్ ఎస్పీ-పీ హెచ్ వీ రామకృష్ణ
విశాఖ డీసీపీ1-విక్రాంత్ పాటిల్
విజయవాడ జాయింట్ సీపీ-నాగేంద్ర కుమార్
రైల్వే ఎస్పీ-కోయ ప్రవీణ్
ఇంటెలిజెన్స్ ఎస్పీ- అశోక్ కుమార్
అనంతపురం పీటీసీ-ఘట్టమనేని శ్రీనివాస్
గుంటూరు రూరల్ ఎస్పీ -రాజశేఖర్ బాబు హెడ్ క్వార్టర్స్ అటాచ్
చిత్తూరు ఎస్పీ-వెంకటప్పల నాయుడు
అనంతపురం ఎస్పీ- ఏసుబాబు
సీఐడీ ఎస్పీ-సర్వ శ్రేష్ఠ త్రిపాఠి
గ్రే హౌండ్స్ గ్రూప్ కమాండర్-రాహుల్ దేవ్ శర్మ
ఏ ఆర్ దామోదర్- హెడ్ క్వార్టర్స్ అటాచ్
విశాఖపట్నం డీసీపీ 2-ఉదయభాస్కర్ బిళ్ళ


మరింత సమాచారం తెలుసుకోండి: