రాంగోపాల్ వ‌ర్మ సంచ‌ల‌నం లేనిదే నిద్ర‌పోడు. ముఖ్యంగా త‌న సినిమాల‌ను ప్ర‌మోట్ చేసుకోవ‌డం కోసం ఎంత దూర‌మైనా వెళ్తాడు. అవ‌స‌ర‌మైతే కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ చేసి తెలివిగా సినిమాను ప్ర‌మోట్ చేసుకుంటాడు. ఇటీవ‌ల ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ప్ర‌మోష‌న్ కోసం ఎంత దూరం వెళ్లాడో తెలిసిందే. రిలీజ్ కు ముందు టీడీపీ కార్య‌క‌ర్త‌లతో వివాదం…అటుపై ఏపీలో రిలీజ్ విష‌యమై విజ‌య‌వాడ పైపుల రోడ్డు వ‌ద్ద ర‌చ్చ గురించి తెలిసిందే. ఇదంతా వ‌ర్మ ఆడుతోన్న ప‌బ్లిసిటీ గేమ్ అంతే. ఆవిష‌యాన్ని ప‌లు సంద‌ర్భాల్లో్నూ వ‌ర్మ బాహాటంగా ఒప్పుకున్నాడు. సినిమాకు ప‌బ్లిసిటీ రావాలంటే ఆ మాత్రం చేయాలంటాడు. ఆ విష‌యంలో మీడియాను వాడుకోవ‌డం వ‌ర్మ‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌ లాంటింది.

గ‌తంలో ఎన్నో సినిమాల విష‌యంలో ఇలా జ‌రిగింది. అయితే అవ‌స‌రానికి మీడియాని వాడుకోవ‌డం త‌ప్పా? కాదా? అలా చేయ‌డం ఆర్జీవీ త‌ప్పా? లేక అత‌ని వెంట ప‌డే మీడియా త‌ప్పా? అన్న దానిపై చాలా సార్లు మీడియాలో డిస్క‌ష‌న్ సాగింది. అయితే ఆ విష‌యంలో వ‌ర్మ త‌ప్పేం లేదంటున్నారు శిష్యుడు జెడి. చ‌క్ర‌వ‌ర్తి. ఆర్జీవీ సెన్షేష‌న్ చేయ‌డు..మీడియానే చేస్తుందన్నారు. ఆయ‌న అన్న మాట నిజ‌మే క‌దా. అయిందానికి కానిదానికి మీడియా చేసే ర‌చ్చ అంత ఇంత కాద‌ని చాలా సంద‌ర్భాల్లో ప్రూవ్ అయింది. ప్ర‌స్తుత మీడియా బ్ర‌తికి ఉన్న మ‌నుషుల‌నే చంపేస్తోంది.

నేనే బ్ర‌తికే ఉన్నాన‌ని అస‌లు వ్య‌క్తి వ‌చ్చ చెప్పే వ‌ర‌కూ గానీ ఆ వార్త‌ను ఆప‌డం లేదు. టీఆర్ పీ కోసం పోటీ ప‌డి మ‌రీ క‌థ‌నాలు వేసిన సంద‌ర్భాలున్నాయి. అలాంటి మీడియా ఆర్జీవీ వెంట‌ ఎలా ప‌డుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆర్జీవీ ఫ‌లానా చోట మాట్లాడుతున్నాడంటే? ఆహ్వానం లేక‌పోయినా మీదప‌డి మరీ మైకులు పెడ‌తారు. ఒక‌వేళ ప‌దే ప‌దే ఆర్జీవీ మీడియా స‌మావేశాలు పెట్టినా అంతే ఓపికాగా మీడియా వెళ్తుంది. ప్రెస్ మీట్ ప్రాముఖ్య‌త ఏంట‌న్న‌ది కూడా ఆలోచించే ప‌రిస్థితి లేదు. మీడియా మ‌సాలా లేనిదే బ్ర‌త‌క‌దు అన్న‌ పాయింట్ ను ప‌ట్ట‌కుని వ‌ర్మ వాడుకుంటాడు. అక్క‌డ సిగ్గు ఉండాల్సింది వ‌ర్మ‌కు కాదు..మీడియా అన్న‌ట్లు జెడీ చుర‌క‌లు వేసాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: