ఒకవైపు పాలనా వ్యవస్థ ప్రక్షాళన - మరోవైపు రాష్ట్ర ఆర్థికపరిస్థితిని చక్కదిద్దటం - మొదటి విషయంపై దూకుడు పెంచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్ర ఆర్థికపరిస్థితి ని చక్కదిద్దేందుకు మాత్రం దూకుడు లేకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించారు. కేంద్ర నిధుల సమీకరణ, ప్రత్యేక హోదా, విభజన అంశాల అమలు, ఇతర విషయాల్లో కేంద్రంతో పాటు తెలంగాణ ప్రభుత్వంతో సైతం సన్నిహిత సంబంధాలను కొనసాగించటం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు సాధించటమే తన ప్రధమ కర్తవ్యంగా అది నెరవేరే దిశగా అడుగులు వేస్తున్నారు.


దాయాదితో పోరాటం ద్వారా సాధించేదానికన్నా నష్టమే ఎక్కువ అని గత ప్రభుత్వ పాలన నుండి గ్రహించిన సీఎం జగన్ తన వంతుగా ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయానికి తెరలేపారు అందుకే హైదరాబాద్‌ లో నిష్ప్రయోజనంగా పది ఉండి అదనంగా వందల కోట్ల రాష్ట్ర ఆదాయాన్ని మింగెసే ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించారు. ఇది అంతర్లీనంగా ఏపికి రెవెన్యూ నష్టాన్ని అరికట్టటం ఒక ప్రయోజనమైతే తెలంగాణా దృష్టిలో ఏపి నూతన పాలకుల పట్ల మైత్రీభావం అంకురించటానికి బలపడటానికి సహ కరిస్తుంది.

Image result for Modi Jagan Kcr

ఇక కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర పలు అంశాలపై జగన్ దృష్టి కేంద్రీక రించారు. ప్రాధాన్యతా క్రమంలో కేంద్రం, తెలంగాణతో ఉన్న విభేదాలను అంశాలవారీ పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం తీవ్ర ఆర్థికలోటుతో కొట్టుమిట్టాడుతుంది. గతపాలనలోని దుబారా, అవినీతి ఆడంబరాల డంబాచారాల వలన అత్యంత భారమైన రెండున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా ఋణ ఊబిలోకి రాష్ట్రం ఇప్పటికే నెట్టివేయబడింది.


దీనికి తోడు రెవెన్యూలోటు ఈ ఏడాది ₹20000 కోట్లకు చేరుకోనుంది. ఈ పరిస్థితుల్లో ముందుగా కేంద్రం నుంచి నిధులు రాబట్టే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సింది గా ఇప్పటికే అధికారులను ఆదేశించారు. పోలవరంతో పాటు అమరావతి రాజధాని నిర్మాణం, రెవెన్యూ లోటు భర్తీ తదితర అంశాలపై కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు సామరస్య పూర్వక పరిష్కారం కనుగొనే దిశగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.


ఇందులో భాగంగా ఈ నెల 9వ తారీఖున తిరుపతి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ప్రత్యేక హోదా సాధ్యపడదని ఇప్పటికే కేంద్రం తేల్చి చెప్పింది. ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీనిపై మరో సారి ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించాలని భావిస్తున్నారు.

Image result for Modi Jagan Kcr

హైదరాబాద్‌ లోని ఏపీ భవనాల అప్పగింత ఒకింత విమర్శలకు దారితీసినా తక్షణం రెవెన్యూఖర్చుల భారం తగ్గటం - భవిష్యత్‌లో ఇరు రాష్ట్రాలమధ్య సత్సంబంధా లకు ఇది బీజం వేస్తుందనే వాదనలు వినవస్తున్నాయి. తెలంగాణ నుంచి ఏపీకి ₹5000 కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది దానిని తిరిగి పొందటానికి మార్గం సుగమం అవుతుంది. దీంతో పాటు 9, 10 షెడ్యూళ్ల లోని ఆస్తుల బదలాయింపుపై సంప్రదింపులు జరపాలని కూడా నిర్ణయించారు.


ముందు విభజన అంశాలు, ఆపై కేంద్ర నిధులకు సంబంధించి కేంద్రాన్ని కోరటంతో "నీతి ఆయోగ్" ఎదుట రాష్ట్రం తరుపున వాదనలు వినిపించేందుకు ఈనెల 15వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా యివ్వటంలో తమకు ఏలాంటి అభ్యంతరాలులేవని గతంలోనే నీతి ఆయోగ్ స్పష్టం చేసిన దృష్ట్యా - తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏతో అకస్మాత్తుగా నాలుగేళ్ళ స్నేహాన్ని తెగ తెంపులు చేసుకోవటం, కేంద్రంపై కత్తి కట్టటంతో కేంద్ర రాష్ట్ర సంభందాలు వివాదంలో పడి రాష్ట్ర ప్రాధమిక ప్రయోజనాలు నెరవేరలేదు.

 Image result for Modi Jagan Kcr

ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరైన గాడిలో పెట్టేందుకు కేంద్రంతో సన్నిహిత సంబంధాలు నెరపాలని ప్రస్తుత సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం. విభజన తో నష్టపోయిన ఏపీకి న్యాయం చేస్తామని గత సార్వత్రిక ఎన్నికల ముందు నరేంద్ర మోదీ తిరుపతి బహిరంగ సభలో ప్రకటించారు. ఈసారి సరిగ్గా అదే చోట రాష్ట్రానికి తగిన భరోసా కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన ₹4000 కోట్లు కేంద్రం నుంచి తెచ్చుకునేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయి. ప్రత్యేక హోదా మాటెలా ఉన్నా రాష్ట్ర ఆర్థికపరిస్థితిని చక్కదిద్దుకునే ప్రక్రియకు తక్షణం కేంద్రం చేయూత అందిస్తుందని ప్రభుత్వ వర్గాలు విశ్వసిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: