ఏపీలో బలమైన సామాజికవర్గం..టీడీపీకి కొమ్ముకాస్తూ, ఎప్పుడూ చంద్రబాబును భుజాన మోసే కమ్మ సామాజికవర్గం  ఇప్పుడు చంద్రబాబును వదలి..తమ దారి తాము చూసుకోబోతున్నారా...చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చి ఇంకో పార్టీ వైపు చూస్తున్నారా..అంటే మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నిజమే అనిపిస్తుంది. ఏపీలో అన్ని సామాజికవర్గాలపై కమ్మ సామాజికవర్గానిదే పై చేయి. తొలుత వ్యాపార, సినీ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న కమ్మ సామాజకవర్గీయులు తమ వ్యాపారాలకు ఎటువంటి నష్టం లేకుండా, రాజకీయంగా అధికారం చెలాయించాలంటే..తమ సామాజికవర్గానికే చెందిన ఒక బలమైన రాజకీయ పార్టీ కావాలని తలిచారు. అలా పుట్టుకువచ్చిందే ఎన్టీఆర్ నాయకత్వంలోని టీడీపీ పార్టీ.  ఎన్టీఆర్ ముఖ‌్యమంత్రి కాగానే  రాజకీయ పదవులతో పాటు, బ్యూరోక్రాట్ వ్యవస్థలో కూడా కమ్మ సామాజికవర్గానికే చెందిన అధికారులకే పెద్ద పీట వేశాడు. 


ఎన్టీఆర్ రాకతో  ఏపీలో అన్ని రంగాలలో కమ్మ సామాజికవర్గం ఆధిపత్యం కొనసాగింది. ముఖ్యంగా సినీ, రాజకీయ, అధికార, మీడియా వర్గాల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన వారిదే పెత్తనం. ఎన్టీఆర్ ఆగమనంతో ఏపీలో రాజకీయాలను శాసించడం మొదలుపెట్టారు కమ్మ సామాజికవర్గీయులు. అయితే ఎన్టీఆర్‌కు బలమైన సపోర్ట్‌గా నిలిచింది..కమ్మ సామాజికవర్గానికే చెందిన మీడియా మెఘలు రాజగురువు మాత్రమే. ఆనాడు ఎన్టీఆర్‌ను నాదెండ్ల వెన్నుపోటు పొడిస్తే..తమ పత్రికలో ఉద్యమమే నడిపి..ఎన్టీఆర్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చింది ఈ రాజగురువే. కమ్మ సామాజికవర్గ పారిశ్రామిక వేత్తలకు, వివిధ రంగాల్లో లబ్ద ప్రతిష్టులైన ప్రముఖులకు  ఈ రాజగురువు మాటే శాసనం. అసలు టీడీపీకి ప్రధాన ఆర్థిక వనరు...ఈ కమ్మ సామాజికవర్గం. 


ఎన్టీఆర్‌ను దేవుడిలా పూజించే ఈ కమ్మ సామాజికవర్గం తమ ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలకు భంగం కలిగే పరిస్థితుల్లో ఆయనకు వెన్నుపోటు పొడవడానికి కూడా వెనుకాడలేదు. లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ రెండో వివాహం చేసుకున్న తర్వాత ప్రభుత్వంలో కమ్మ సామాజికవర్గ పెత్తానానికి భంగం కలిగింది.  దీంతో చంద్రబాబుతో కలిసి తమ కులదైవమైన ఎన్టీఆర్‌కు కూడా వెన్నుపోటు పొడవడానికి కూడా వెనుకాడలేదు ఈ కమ్మసామాజికవర్గం. 9 ఏళ్ల  చంద్రబాబు హయాంలో ఏపీలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కమ్మ సామాజికవర్గం ఆధిపత్యం చెలాయించింది. కమ్మ పెద్దలకు కావల్సిందల్లా తమ వ్యాపారాల విస్తరణకు, కులాధిపత్యానికి ప్రతినిధిగా తమ సామాజికవర్గానికి చెందిన ఒక వ్యక్తి కావాలి. అందుకే చంద్రబాబును కమ్మ సామాజికవర్గం భుజాన మోసింది.

అయితే రాజకీయ, వ్యాపార రంగంలో తిరుగులేని ఆధిపత్యం వహించిన ఈ కమ్మ సామాజికవర్గానికి సినీ రంగంలో ఎదురు దెబ్బ తగిలింది. కాపు సామాజికవర్గానికే చెందిన మెగాస్టార్ చిరంజీవి 25 ఏళ్ల పాటు నెంబర్ వన్‌గా కొనసాగి కమ్మ సామాజికవర్గానికి చెక్ పెట్టాడు. దీంతో పగబట్టిన కమ్మ సామాజికవర్గ మీడియా..చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అడ్డగోలుగా దుష్ప్రచారం చేసి, పార్టీని కాంగ్రెస్‌లో కలిపేవరకు ఆగలేదు. అధికారం తమ  సామాజికవర్గం నుంచి దూరం అవుతుందని భయపడిన కమ్మ పెద్దలు చిరు ప్రజారాజ్యం పార్టీ అట్టర్‌ఫ్లాప్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత వైయస్ఆర్ దెబ్బతో తమ కులాధిపత్యానికి గండిపడిందని కలవరపడిన కమ్మ సామాజికవర్గీయులు ఆయన మరణంతో ఊపిరిపీల్చుకున్నారు. 


 అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యంగా సాగిన కమ్మ సామాజివర్గ పెత్తనానికి రాష్ట్ర విభజనతో గండిపడింది. తెలంగాణలో వెలమ సామాజికవర్గానికి చెందిన కేసీఆర్ అధికారంలోకి రావడంతో కమ్మ సామాజికవర్గం ఖంగుతింది. అయితే ఏపీలో మాత్రం తమ సామాజిక వర్గ ప్రతినిధిగా చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఊపిరి పీల్చుకుంది. కమ్మ సామాజికవర్గీయులకు తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాలే ముఖ్యం. అక్కడ అధికారంలో తమ సామాజికవర్గ ప్రతినిధి వచ్చే అవకాశాలు లేకపోతే..వేరే సామాజికవర్గంతో కలిసేందుకు కూడా వెనుకాడరు. తెలంగాణలో బలమైన రెడ్డి సామాజికవర్గానికి, చంద్రబాబుతో చెక్ పెట్టే అవకాశం లేకపోవడంతో వెలమ సామాజిక వర్గానికి చెందిన కేసీఆర్ పంచన చేరారు కమ్మ సామాజికవర్గీయులు. తమ సామాజికవర్గానికే చెందిన తుమ్మల, మాగంటి గోపీనాథ్ రెడ్డి, అరికెపూడి గాంధీ, పువ్వాడ అజయ్‌కుమార్ లాంటి నేతలను టీఆర్ఎస్‌ పార్టీలో చేర్పించి తమ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంది...కమ్మ సామాజికవర్గం. 


అంతే కాదు కమ్మ పెద్దలకు తమ సామాజికవర్గానికి చెందిన నేతకు పదవి కంటే తమ స్వప్రయోజనాలే ముఖ్యమని మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో తేలిపోయింది. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీతో కలిసి, మహాకూటమి గట్టి గట్టిగా ప్రచారం చేసినా కమ్మ సామాజికవర్గీయులు కనికరించలేదు. తెలంగాణలో చంద్రబాబుకు అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవని గ్రహించిన కమ్మ  సామాజికవర్గం గుంపగుత్తగా టీఆర్ఎస్‌కు జై కొట్టింది. దీనికి ఫలితమే గ్రేటర్ హైదరాబాద్‌లో కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్ ప్రాంతాల్లో టీడీపీ చావు దెబ్బ తినడం. కూకట్‌పల్లిలో తమ కులదైవం ఎన్టీఆర్ మనవరాలు, హరికృష్ణ కూతురు స్వయంగా పోటీ చేసినా కమ్మ సామాజికవర్గీయులు పట్టించుకోలేదు. తెలంగాణలో రెడ్డి సామాజికవర్గానికి చెక్ పెట్టే సత్తా కేసీఆర్‌తోనే సాధ్యమని నమ్మి ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటేశారు. స్వయంగా తమ కులదైవం ఎన్టీఆర్ మనవరాలినే ఓడించిన ఘనులు..ఈ కమ్మ కులస్థులు.    తాజాగా కమ్మ సామాజికవర్గానికే చెందిన నామా నాగేశ్వరావు లాంటి కరడు గట్టిన టీడీపీ వాదికూడా టీఆర్ఎస్‌లో చేరాడు. తద్వారా తెలంగాణలో వెల్‌కమ్ ధియరీతో వెలమలతో కలిసిన కమ్మ సామాజికవర్గం తన ఉనికిని కాపాడుకుంటుంది. 


తాజాగా ఏపీలో తమ కుల ప్రతినిధి చంద్రబాబు ఘోర పరాజయం పాలవడంతో కమ్మ సామాజికవర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో గత ఐదేళ్లుగా టీడీపీ హయాంలో సాగించిన పెత్తనానికి గండిపడిందని కమ్మ పెద్దలు భావిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గం బలపడడం..తమ సామాజికవర్గ ప్రతినిధి చంద్రబాబు పూర్తిగా పతనం కావడం. వైయస్ జగన్‌మోహన్ రెడ్డి 30 ఏళ్లు అధికారంలో ఉండేలా ప్రజా సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే..కనీసం పదేళ్ల పాటు టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని కమ్మ సామాజికవర్గీయులకు అర్థమైంది. బాబుగారి తనయుడు లోకేష్ సమర్థత లేదని, చంద్రబాబు తర్వాత పార్టీని ముందుకు నడిపించే నాయకుడు లేడని, టీడీపీకి ఫ్యూచర్ లేదని కమ్మ పెద్దలు భావిస్తున్నారు. 


జూ. ఎన్టీఆర్‌కు టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చే సత్తా ఉన్నా కమ్మ సామాజికవర్గీయులు ఎన్టీఆర్‌ను ఓన్ చేసుకోలేదు. టీడీపీ తల్లిది తమ సామాజికవర్గం కాదనే భావన కమ్మోళ్లలో నెలకొంది. పోనీలే తమ బ్రీడే అని  ఒక వేళ జూ. ఎన్టీఆర్‌‌ను ఓన్ చేసుకున్నా,  టీడీపీని అధికారంలోకి తీసుకురావాలంటే ఇంకో పదేళ్లు పడుతుందని కమ్మ సామాజికవర్గీయులు అంచనా వేసుకుంటున్నారు. ఈ పదేళ్లు తమ రాజకీయ, ఆర్థిక స్వప్రయోజనాల కోసం ఇప్పుడు బీజేపీవైపు అడుగులు వేయాలని కమ్మ సామాజికవర్గ పెద్దలు భావిస్తున్నారు. అటు బిజేపీ కూడా ఏపీలో టీడీపీని ఖాళీ చేసి వచ్చే ఎన్నికల వరకు వైసీపీకి ప్రధాన ప్రత్యర్థిగా నిలిచేందుకు స్కెచ్ వేసింది. అందులో భాగంగానే టీడీపీలో బలమైన కమ్మ సామాజికవర్గ నేతలను బీజేపీలోకి చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసింది. కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు కూడా వైసీపీలో చేరలేదు. అందుకే వారికున్న ఏకైక ఆప్షన్ బిజేపీనే. 


ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని బీజేపీ పెద్దలకు టచ్‌లో ఉండగా, రాయపాటి లాంటి కమ్మ సామాజికవర్గ నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా టీడీపీలో కమ్మ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను, మాజీ ఎంపీలను కూడా బీజేపీ టార్గెట్ చేసినట్లు సమాచారం. ఓవరాల్‌గా తమ వ్యాపార, ఆర్థిక ప్రయోజనాలకోసం ఏపీలోని కమ్మ సామాజికవర్గం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కమ్మ సామాజికవర్గ రాజగురువు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని వదిలి పొరపాటు చేశావని చంద్రబాబుకు రాజగురువు క్లాస్ పీకాడు కూడా. దీంతో కమ్మ సామాజికవర్గ నేతలు తమ రాజకీయ, ఆర్థిక భవిషత్తు కోసం బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. చూశారుగా..కమ్మ సామాజికవర్గానికి కావల్సిందల్లా తమ స్వప్రయోజనాలు కాపాడే నాయకుడు, పార్టీనే. అది తమ సామాజికవర్గానికే చెందిన చంద్రబాబు వంటి నేతలు లేకపోతే..వేరే సామాజికవర్గానికి చెందిన పార్టీల పంచన చేరడానికి కూడా వెనుకాడదు. సో..పదేళ్ల పాటు భవిష్యత్తు లేని చంద్రబాబును నమ్ముకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే మళ్లీ ఏపీలో రాజకీయంగా, ఆర్థికంగా ఆధిపత్యం చెలాయించవచ్చు అని కమ్మ సామాజికవర్గీయుల భావన. అందుకే చంద్రబాబుకు దూరం జరిగి మోదీకి, బీజేపీకి దగ్గరయ్యే పనిలో ఉన్నారు కమ్మ సామాజిక వర్గీయులు. అదండి సంగతి..తమ ఆధిఫత్యానికి గండిపడితే చంద్రబాబు లాంటి నాయకులను కూడా పక్కన పెట్టడానికి ఏ మాత్రం వెనుకాడదు ఈ కమ్మసామాజికవర్గం. అంతేగా మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: