వైకాపా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి రోజా ఆ పార్టీలోనే ఉన్నారు.  ఇంకా చెప్పాలి అంటే కాంగ్రెస్ పార్టీలో జగన్ ఉన్నప్పటి నుంచి ఆ పార్టీకి రోజా సన్నిహితంగా మెలిగిన సంగతి తెలిసిందే.  2014 ఎన్నికల సమయంలో రోజా నగరి నుంచి విజయం సాధించింది. వైకాపాకు చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయినా.. రోజా పార్టీ పార్టీని వదలలేదు.  జగన్ వెన్నంటే ఉన్నది.  


2019 ఎన్నికల సమయంలో కూడా రోజా నగరి నుంచి మంచి విజయాన్నిసొంతంచేసుకుంది .  2019 లో వైకాపా అధికారంలో వచ్చింది.  రోజాకు మంత్రి పదవి ఖాయం అని ప్రచారం జరిగింది.  తరువాత రోజాకు స్పీకర్ పదవి ఇస్తున్నారని ప్రచారం జరిగింది.  కానీ ఆ ప్రచారం కేవలం ప్రచారం లాగే ఉండిపోయింది.  


స్పీకర్ పదవిని ఉత్తరాంధ్ర వాళ్లకు ఇవ్వాలని జగన్ నిర్ణయించారని వార్తలు వస్తున్నాయి.  ఒకవేళ ఉత్తరాంధ్ర వ్యక్తులకు కేటాయిస్తే రోజా పరిస్థితి ఏంటి.. రోజాకు మంత్రి పదవి లేకుండా అటు స్పీకర్ పోస్ట్ లేకుంటే అన్యాయం జరిగినట్టే కదా.  ఇంకో సమాచారం ప్రకారం రోజాకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వొచ్చని ప్రచారం.  


ఇప్పటి వరకు ఇవన్నీ కేవలం అనుమానాలు పుకార్లు మాత్రమే.  ఎవరికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు.. ఇస్తున్నారు అన్నది ఎల్లుడి అంటే జూన్ 8 వ తేదీతో తేలిపోతుంది.  ఎవరి ఏమిటో చూద్దాం మరి.  


మరింత సమాచారం తెలుసుకోండి: