తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ పై ఉన్నది.  పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తెరాస పార్టీలోకి జంప్ అయ్యారు.  దీంతో ఆ పార్టీ మనుగడ ప్రశ్నర్ధకంగా మారింది.  ప్రతిపక్షంలో ఉండాలి అంటే కనీసం 8 మంది ఎమ్మెల్యేలు ఉండాలి.  కానీ, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 5 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.  దీంతో కాంగ్రెస్ పార్టీని అధికార పార్టీలో విలీనం చేసుకున్నట్టు తెరాస పార్టీ చెప్పింది.  


దీనిపై మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు.  పార్టీలను విలీనం చేసుకునే అధికారం శాసనసభ స్పీకర్లకు లేదని అనాన్రు.  ఇది స్పీకర్ పరిధిలోది కాదని, పార్టీలను విలీనం చేయాలంటే అది కేంద్ర ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటుందని అన్నారు.  


కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించి టీఆర్ఎస్‌లో విలీనానికి ఒత్తిడి తెచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇక స్పికర్‌కు సభ నిర్వాహణతోపాటు పార్టీ ఫిరాయింపులపై విచారణ జరిపి వారిపై అనర్హత వేటు వేసే అధికారం మాత్రమే స్పికర్‌కు ఉంటుందని అన్నారు.  


2016 లో ఇదే విధమైన సంఘటన చోటు చేసుకుంటే.. అప్పట్లో తాము హైకోర్టు కు వెళ్ళమని, హైకోర్టు అసెంబ్లీ జరీ చేసిన బులిటెన్ చెల్లదని చెప్పిందని, అనర్హత పిటిషన్లను మూడు నెలల్లో విచారించాలని హైకోర్ట్ ఇచ్చిన డైరెక్షను స్పీకర్ ఉల్లంఘించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: