కర్ణాటకలో కాంగ్రెస్.. జేడీఎస్ ల సంకీర్ణప్రభుత్వం అధికారంలో ఉంది. కొన్నాళ్ళు సజావుగానే నడిచిన ఈ సంకీర్ణ ప్రభుత్వం ఇప్పుడు ఇరకాటంలోపడింది .  రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తపోసుకుంటున్నారు.  విమర్శలు చేసుకుంటున్నారు.  అక్కడితో ఆగకుండా.. ట్వీట్లతో యుద్ధం చేస్తున్నారు.  


ఎవరికి సర్ది చెప్పలేని పరిస్థితి.  ఏమంటే ఏమౌతుందో అని చెప్పి ముఖ్యమంత్రి కుమారస్వామి మౌనంగా ఉంటున్నారు.  ముఖ్యమంత్రి మౌనంగా ఉండటంతో మాటల యుద్ధం మరింత పెరిగిపోయింది.  ముఖ్యమంత్రి మౌనంగా ఉండటం కొంతమంది నాయకులకు నచ్చడంలేదు.  


మాజీ సీఎం సిద్ధరామయ్య తీరును వ్యతిరేకిస్తూ రెండు పార్టీల్లోనూ రాజీనామా చేసేందుకు నాయకులు సిద్ధమయ్యారు. ఇప్పటికే జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.విశ్వనాథ్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే మాజీ మంత్రులు రామలింగారెడ్డి - రోషన్ బేగ్ కూడా సిద్ధరామయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై సిద్ధరామయ్యతో పలుమార్లు సమావేశమైన సీఎం కుమారస్వామి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేని స్థితిలో మౌనం వహిస్తున్నారు.  


సీఎం మౌనంగా ఉండటంతో సిద్దిరామయ్య రాష్ట్రంలో అంటా సజావుగానే ఉందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలియజేశాడు.  కుమారస్వామి మౌనంగా ఉండటంతోనే సొంతపార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు కుమారస్వామి తీరును వ్యతిరేకిస్తున్నారు.  ఈ సమయంలో రాష్ట్రంలో ఎం జరగబోతుందో ఎవరికీ తెలియడం లేదు.   


మరింత సమాచారం తెలుసుకోండి: